Home Andhra Pradesh టీడీపీకి పవన్ కళ్యాణ్ షాక్

టీడీపీకి పవన్ కళ్యాణ్ షాక్

pawan kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఆయన టీడీపీ, బిజెపి కూటమికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న నంద్యాల ఉప ఎన్నికల్లో పవన్ తమకు మద్దతు ప్రకటిస్తారని టీడీపీ అధిష్టానం ఆశించింది.  కానీ పవన్ కళ్యాణ్ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ఎవరికీ మద్దతు ఇవ్వటంలేదని..తటస్థంగా ఉంటామని ప్రకటించారు. ఇది టీడీపీకి ఒకింత ఇబ్బందికర పరిణామమే. పవన్ కళ్యాణ్ తో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో అన్న ఉద్దేశంతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకుని..మంత్రులు ఆయన విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా ప్రభుత్వంపై విమర్శలు చేసినా..ఏదో పైపైన మాత్రమే ఎదురుదాడి చేస్తూ వచ్చారు. కానీ రాబోయే రో జుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందో వవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం ఓ ఉదాహరణగా చూడొచ్చా? అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు అంచనాలు కడుతున్నారు. వీడియో రూపంలో పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించి గందరగోళానికి తెరదించారు. చంద్రబాబుతో పవన్ తాజాగా కూడా  భేటీ అయ్యారు. టీడీపీతో సన్నిహితంగా ఉంటున్నందున నంద్యాలలోనూ మద్దతు ఇస్తారేమో అని అందరూ ఆశించారు.

                               కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు.  నంద్యాల ఉప ఎన్నికల్లో తాము తటస్థంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్‌ కల్యాణ్‌ బుధవారమిక్కడ తెలిపారు. తాము ఎవరికో మద్దతు ఇస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. 2019 వరకూ ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం జరిగాకే ఎన్నికలకు వెళతామన్నారు. అప్పటివరకూ జరిగే ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయమని, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి జనసేన మద్దతు ఉండదని పవన్‌ అన్నారు.  జనసేన కార్యకర్తలు అభిప్రాయం తీసుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీ అయిన జనసేన మద్దతు తమ పార్టీకే ఉందని చెపితే నమ్మవద్దని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here