Home Cinema సత్తా చాటిన ‘పవన్ కళ్యాణ్’ !

సత్తా చాటిన ‘పవన్ కళ్యాణ్’ !

Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి తన సత్తా చాటారు. అసలు సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ జోరుగా సాగుతోందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్, తివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే.. ఈ సినిమాకు సంబంధించిన నైజాం హక్కులు, నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేసిందని  టాక్‌. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు 29 కోట్లకు నైజాం హక్కుల ను సొంతం చేసుకున్నారని చెబుతున్నారు.

                       శాటిలైట్ హక్కులను ఓ ప్రమఖ చానెల్‌ 19.5 కోట్లకు దక్కించుకుందని సమాచారం. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ సంస్థలో రాధాకృష్ణ, భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు పవన్ కల్యాణ్ పుట్టినరోజున కోలవెరీ ఢీ ఫేమ్ అనిరుథ్ రవిచంద్రన్ విడుదల చేసిన చిన్న సాంగ్ బిట్‌ పవన్‌ అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్‌కు జంటగ కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here