Home Cinema ‘పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది

‘పద్మావతి’ ట్రైలర్ వచ్చేసింది

padmavati-trailer

భారీ భారీ సెట్టింగ్ లు..రాజరిక దర్పంతో కనపడే కోటలు..వేలాది మంది సైనికులతో కూడిన ఫైటింగ్ ల సీన్లు..అత్యంత గ్రాండ్ గా  ఉండే సన్నివేశాలతో ‘పద్మావతి’ ట్రైలర్ సోమవారం నాడు విడుదల అయింది. ఈ ట్రైలర్ విడుదల అయిన కొద్దిసేపటికే బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ట్వీట్లు చేశారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో  ’పద్మావతి’గా దీపికా పదుకోణే  నటిస్తుండగా.. ఆమె భర్త, చిత్తోర్‌గఢ్‌ రాజ రతన్‌ సింగ్‌గా షాహిద్‌ కపూర్‌, విలన్‌ సుల్తాన్‌ అల్లావుద్దీ ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం మధ్యాహ్నం సరిగ్గా.. 13.03 గంటలకు విడుదల చేశారు. భన్సాలీ మార్క్‌ గ్రాండ్‌ విజువలైజేషన్‌.. ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఆనాటి రాచరిక వైభవానికి ప్రతిరూపంగా సినిమా మలిచినట్టు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.

                             ఈ ట్రైలర్‌లో ఖిల్జీగా రణ్‌వీర్‌ సింగ్‌ భయానక రౌద్రరూపంతో ఆకట్టుకోగా.. అతనితో వీరోచితంగా పోరాడే పాత్రల్లో షాహిద్‌, దీపిక అభినయం ట్రైలర్‌లో చూడొచ్చు. ఈ సినిమా ట్రైలర్‌ను సరిగ్గా 13.03 గంటలకు విడుదల చేయడం వెనుక ఒక కారణముంది. చారిత్రకంగా సరిగ్గా 1303లోనే చిత్తోర్‌గఢ్‌పై అల్లావుద్దీన్‌ ఖిల్జీ దండయాత్ర విజయవంతమైంది.  గుహిలాసింగ్‌ రత్నసింహా (లేదా రతన్‌సింగ్‌) ఆధ్వర్యంలో రాజ్‌పుత్‌ సేనతో ఎనిమిది నెలలు యుద్ధంచేసిన ఖిల్జీ.. చివరకు 1303లో ఈ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకసున్నాడు. ఆ చారిత్రక ఘట్టానికి గుర్తుగా అన్నట్లుగా 13.03 గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇది ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

పద్మావతి ట్రైలర్ లింక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here