Home Andhra Pradesh చంద్రబాబు ‘ట్యూన్స్ కు అనుగుణంగా ఎన్టీవీ’ డ్యాన్స్!

చంద్రబాబు ‘ట్యూన్స్ కు అనుగుణంగా ఎన్టీవీ’ డ్యాన్స్!

ntv

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్యూన్స్ ప్రకారమే ఎన్టీవీ డ్యాన్స్ చేస్తోందా?. ఆ టీవీలో వచ్చిన ఓ కార్యక్రమం చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాకమానదు?. కాంగ్రెస్ పార్టీ గుంటూరు సభపై ఎన్టీవీలో ప్రసారం అయిన కథనం..భాష చూస్తే అసలు ఈ ఛానల్ కు ఏమైంది? అన్న భావన కలగటం ఖాయం. అచ్చం చంద్రబాబు భాషే. కాంగ్రెస్ పార్టీ ఏపీ గొంతు కోసింది. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీపై ఏపీ ప్రజల్లో ఉన్న కోపం ఎవరూ కాదనలేనిదే. ఆ దెబ్బకే ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా నష్టపోయింది. అలాంటి కాంగ్రెస్ పార్టీపై ఎన్టీవీ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరైనా అవాక్కు అవ్వాల్సిందే. ‘అసలు ఏపీకి కాంగ్రెస్ పార్టీ నేతలు రావద్దట. ఇంకా గాయం పచ్చిగా ఉందట. ఏపీ ప్రజలు కాంగ్రెస్ ను ఎప్పటికీ క్షమించరు. గొంతు చించుకోవటమే కాదు..గుడ్డలు చించుకున్నా కాంగ్రెస్ నమ్మరు. ప్రజలు క్షమించరు.’ అని ఆ స్టోరీలో  వ్యాఖ్యానించింది. ఇవే కాదు..ఇంత కంటే దారుణమైన వ్యాఖ్యలు ఇంకా ఎన్నో.  అసలు ఓ పార్టీ నేతలను ఏపీకి రావద్దనే అధికారం ఆ ఛానల్ కు ఎవరు ఇచ్చారు.

                             ప్రజలు కాంగ్రెస్ ను నమ్ముతారా? లేదా..వాళ్ళకు ఓట్లు వేస్తారా లేదా అన్నది వారిష్టం. కానీ ఓ ఛానల్ ఏకంగా రాజకీయ పార్టీ కంటే దారుణంగా ‘టార్గెట్’ చేయటం ఏమిటి?,. అంటే అచ్చం చంద్రబాబు మాట్లాడినట్లే ఎన్టీవీ స్టోరీ నడిపేసింది.  విభజన విషయంలో ఏపీ ప్రజలు కాంగ్రెస్  తమను మోసం చేసిందని భావిస్తున్న మాట వాస్తవమే. ఆ ఫ్రభావం 2014 ఎన్నికల్లో వారు చూశారు కూడా. మరి ఇదే ప్రజలను బహిరంగ సభల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన అటు మోడీ..ఇటు చంద్రబాబు లను ఎన్టీవీ ఒక్కటంటే ఒక్క మాట అనలేదు. అంటే కాంగ్రెస్ చేసింది మాత్రమే మోసం. మరి బహిరంగంగా చెప్పి మోసం చేసిన చంద్రబాబు, మోడీ, వెంకయ్యనాయుడులు మాత్రం ఏపీ ప్రజలకు న్యాయం చేసినట్లా?. ఎన్టీవీ స్టోరీ చూసిన వారెవరికైనా దీని వెనక ఉన్న మర్మం అట్టే తెలిసిపోతుంది.

 

 

1 COMMENT

  1. ఎవరి భజన వారు చేసుకున్నా తుదకు జనమే బుద్ది చెప్తారని నా వ్యక్తిగత అభిప్రాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here