Home Latest News ఎన్టీవీకి షాక్

ఎన్టీవీకి షాక్

ntv

ఎన్టీవీకి బుధవారం నాడు షాక్ తగిలింది. ఈ ఛానల్ కు చెందిన ఓబీ వ్యాన్ ను ఆందోళనకారులు దగ్ధం చేశారు. మంటల్లో ఈ వ్యాన్ పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలోని కుకునూరుపల్లి లో జరిగింది. బుధవారం నాడు ఈ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయం అధికారుల వేధింపుల వల్ల మృతి చెందినట్లు వార్తలు వెలువడ్డాయి. మధ్యాహ్నానికి పోలీసులు మరో కథనం తెరపైకి తీసుకొచ్చారు. బుధవారం హైదరాబాద్ లో మరణించిన బ్యూటీషియన్ శిరీషకు …ఎస్ఐకు సంబంధం ఉందని..మద్యం మత్తులో ఎస్ఐ ఆమెను రేప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు.

                              ఇవే కథనాలు అన్ని మీడియాల్లోనూ వెలువడ్డాయి. తర్వాత గ్రామస్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…ఎస్ఐ మృతిని తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడే ఉన్న ఎన్టీవీ ఓబీ వ్యాన్ ను కింద పడేసి..ఆగ్రహంతో నిప్పుపెట్టారు. దీంతో ఇది పూర్తిగా తగలపడిపోయింది. అక్కడ పోలీసులు ఉన్నా ఆందోళణ కారులను అదుపు చేయటంలో విఫలమయ్యారు. దీంతో ఎన్టీవీ ఓబీ వ్యాన్ పూర్తిగా మంటల్లో కాలి బూడిదై పోయింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here