Home Politics కొరియా దేశాల్లో యుద్ధ మేఘాలు

కొరియా దేశాల్లో యుద్ధ మేఘాలు

north korea

కొరియా దేశాల్లో యుద్ధ మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. అమెరికాకు చెందిన వివాదాస్ప‌ద థాడ్ మిస్సైల్ వ్య‌వ‌స్థ ద‌క్షిణ కొరియా చేరుకున్న‌ది. క్షిప‌ణి వ్య‌వ‌స్థ‌లో థాడ్‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. ఇది అత్యంత ప‌టిష్ట‌మైన వ్య‌వ‌స్థ‌. ప్ర‌స్తుతం నార్త్ కొరియా మాటిమాటికీ క‌వ్వింపుల‌కు దిగుతున్న నేప‌థ్యంలో అమెరికా త‌న బ‌ల‌మైన మిసైల్ వ్య‌వ‌స్థ‌ను సౌత్ కొరియాకు తీసుకువ‌చ్చింది. ఆ మిసైల్ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన వాహ‌నాలు సియోల్‌కు ద‌క్షిణంగా 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. డిఫెన్స్ వాహ‌నాల్లో మిస్సైల్స్‌ను తీసుకువ‌చ్చారు. థాడ్ క్షిప‌ణులు రావ‌డాన్ని స్థానిక సౌత్ కొరియా ప్ర‌జ‌లు వ్య‌తిరేకించారు. వాహ‌నాల‌ను తీసుకువ‌స్తున్న రోడ్డు వెంట భారీ సంఖ్య‌లో పోలీసుల‌ను మోహ‌రించారు. ఆందోళ‌న‌కారుల‌కు, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో ప‌దిమంది గాయ‌ప‌డ్డారు. నార్త్ కొరియా ప‌దేప‌దే చేస్తున్న మిసైల్ బెదిరింపుల‌ను ఎదుర్కొనేందుకు థాడ్ వ్య‌వ‌స్థ‌ను రంగంలోకి దించాల్సి వ‌చ్చింది. థాడ్ మిస్సైళ్ల వ‌ల్ల కొరియా ప్రాంతంలో భ‌ద్ర‌త బ‌ల‌హీన‌మ‌వుతుంద‌ని చైనా ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

                        నార్త్ కొరియా మ‌రికొన్ని అణు, మిస్సైల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించాలని ప్ర‌య‌త్నిస్తున్న నేప‌థ్యంలో వివాదాస్ప‌ద కొరియా ద్వీప‌క‌ల్పానికి అమెరికా త‌న యుద్ధ‌నౌక‌ల‌ను పంపిస్తున్న‌ది. యుద్ధ నౌక‌లు మోహ‌రించ‌డంతో ప్ర‌స్తుతం తూర్పు ఆసియా ప్రాంతంలో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణ నెల‌కొన్న‌ది. స్వ‌ల్ప‌, మ‌ధ్య శ్రేణి క్షిప‌ణుల‌ను థాడ్ మిసైల్ వ్య‌వ‌స్థ మొద‌టి ద‌శ‌లోనే ధ్వంసం చేస్తుంది. నార్త్ కొరియా దూకుడును అడ్డుకునేందుకే అమెరికా థాడ్ వ్య‌వ‌స్థ‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు ద‌క్షిణ కొరియా ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌ వెల్ల‌డించింది. మరోవైపు స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారుచేసిన యుద్ధ‌నౌక‌ను ఇవాళే చైనా జ‌ల‌ప్ర‌వేశం చేసింది. దీంతో అక్క‌డ ప‌రిస్థితి మ‌రింత భ‌యాన‌కంగా మారింది. అమెరికాకు చెందిన జలాంతర్గామి యూఎస్ఎస్ మిచిగన్, యుద్దనౌక కార్ల్ విన్సన్ కూడా కొరియా ద్వీపకల్పానికి చేరుకున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here