Home Telugu యూపీ పాఠ‌శాల‌ల్లో…..శనివారం ‘నో బ్యాగ్ డే’

యూపీ పాఠ‌శాల‌ల్లో…..శనివారం ‘నో బ్యాగ్ డే’

no bag day

ఉత్తరప్రదేశ్ లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే విద్యార్థులు శనివారం నాడు పాఠశాలలకు స్కూల్ బ్యాగు తీసుకురావాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం సర్కార్ సర్క్యూలర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. శనివారంను నో బ్యాగ్ డేగా ప్రకటించింది. ప్రతీ శనివారం పిల్లలకు పాఠాలు భోదించడం కాకుండా.. ఇతర యాక్టివిటీస్ చేయించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉల్లాస, సంతోషభరితమైన కార్యక్రమాలు చేయించడం వలన పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్‌ తో పాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య మంచి సంబంధం ఏర్పడుతుందని యూపీ డిప్యూటీ సీఎం దినేశ్ శర్మ తెలిపారు. ఇక స్కూల్ బ్యాగు అదొక్క రోజు మోయకపోవడంతో తల, మెడ, మోకాళ్లకు పనిభారం తగ్గి, విద్యార్థులు కాస్త ఉపశమనం పొందుతారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here