Home Cinema నివేదా థామస్ జోరు

నివేదా థామస్ జోరు

Niveda_Thomas

టాలీవుడ్ లో మళయాళ భామ నివేదా థామస్ దుసుకెళుతోంది. వరస పెట్టి ఛాన్స్ లు కొట్టేస్తోంది. తొలి సినిమా నుంచి మంచి నటన కనపర్చటంతో పాటు..పరిశ్రమలో కలసి పోవటంతో ఆమెకు అవకాశాలు అలా కలసి వస్తున్నాయి. ఆమె చేసిన తాజా సినిమాలు నిన్ను కోరి…జై లవకుశ కూడా మంచి ఫలితాన్నే ఇఛ్చాయి. దీంతో ఈ అమ్మడి ఆఫర్లు వరస పెట్టి వస్తున్నాయి. తాజాగా శర్వానంద్ జోడీగా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.

                    శర్వానంద్ కూడా మహానుబావుడు సినిమా సక్సెస్ తో జోష్ లో ఉన్నాడు. ఇప్పుడు స్వామి రారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నివేదా థామస్ నటించనుంది. మరో హీరోయిన్ గా కూడా కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here