Home Cinema ‘నిన్నుకోరి ‘ మూవీ రివ్యూ

‘నిన్నుకోరి ‘ మూవీ రివ్యూ

Ninnu kori

ఒకప్పుడు హీరో నాని సినిమా మినిమం గ్యారంటీ. ఇప్పుడు నాని సినిమా అంటే అది హిట్టే. అలా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ లో నాని ట్రాక్ రికార్డు. నాని చేసిన సినిమాలు అన్నీ వరస పెట్టి హిట్లు కొడుతున్నవే. భలే భలే మగాడివోయ్ నుంచి మొదలుపెడితే కృష్ణగాడి వీరప్రేమగాథ, జెంటిల్ మెన్, నేను లోకల్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. వరస పెట్టి హిట్లు కొడుతుంటే ఎవరికైనా ఆనందంతో పాటు టెన్షన్ కూడా ఉంటుంది. నాని, పినిశెట్టి ఆది, నివేధా థామస్ లు నటించిన ‘నిన్ను కోరి’ సినిమా శుక్రవారం నాడు విడుదల అయింది. మరి అన్ని నాని సినిమాల్లాగే ఇది కూడా హిట్టేనా? లేదా తెలుసుకోవాలంటే ఈ సమీక్షపై ఓ లుక్కేయండి.  ఒక్క మాటలో చెప్పాలంటే వరస పెట్టి హిట్లు కొడుతున్న నాని  ఈ సినిమాలో చేయటం కూడా ఓ  సాహసమే. నాలుగు సినిమాలు హిట్లు అయితే హీరోయిజం ఎలివేషన్ తప్ప ఏమీ కోరుకుని హీరోలున్న  తెలుగు సినీ పరిశ్రమలో కథలో కొత్తదనం కోసం పాత్ర ఏదైనా చేయటం..సక్సెస్ సాధించటం నాని గొప్పతనమే.

                            ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఉమామహేశ్వరరావు (నాని)  వైజాగ్ లో పీహెచ్ డీ చేస్తూ హాస్టల్ ఉంటాడు. అదే సమయంలో డ్యాన్స్ నేర్చుకోవాలనే ఎంతో ఆసక్తితో ఉన్న పల్లవి (నివేథా థామస్) ఓ పెళ్ళిలో డ్యాన్స్ చేస్తున్న నానిని చూస్తుంది. అప్పుడే ఆమె నానిని తన గురువుగా ఫిక్స్ అవుతుంది. డ్యాన్స్ నేర్పించమని..అందుకు ఐదు వేల రూపాయల ఫీజు ఇస్తానని చెబుతుంది. అప్పటికే హాస్టల్..మెస్ బిల్లుల కోసం డబ్బు లు వెతుకుతున్న నాని అందుకే సై అంటాడు. వైజాగ్ లో బీచ్ ఒడ్డున ఓ అందమైన ప్రాంతంలో డ్యాన్స్ నేర్చుకుని కాలేజీలో ప్రదర్శన ఇస్తుంది. ఆ  క్రమంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ డెవలప్ అవుతుంది. ఉమా పీహెచ్ డీ పూర్తి చేసి…సెటిల్ అవ్వాలని యోచిస్తున్న సమయంలో తనకు ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని ..ఎలాగైనా లేచిపోయి పెళ్లి చేసుకుందామని పల్లవి ఉమాపై ఒత్తిడి చేస్తుంది.   కానీ ఏడాది పాటు ఆగితే తన కెరీర్ లక్ష్యానికి ఓ ముగింపు వస్తుందని..అదికాగానే పెళ్లి చేసుకుందామని చెప్పి ఉమా ఢిల్లీ వెళ్లిపోతాడు. ఈ మధ్యలో పల్లవికి అరుణ్ (ఆది పినిశెట్టి)తో పెళ్లి అవుతుంది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోతుంది. ప్రేమించిన వాడిని కాదని పెళ్లిచేసుకున్న పల్లవి సంతోషంగా లేదని భావించిన ఉమా ఆమెను తలచుకుంటూ మందుకు బానిస అవుతాడు. చివరకు ఉద్యోగాన్ని కూడా పొగొట్టుకునే పరిస్థితికి చేరుకుంటాడు.

                                      మరి పల్లవి మొదట ప్రేమించిన ఉమా దగ్గర అవుతుందా?. లేదా వెండితెరపైనే చూడాలి. దర్శకత్వం బాధ్యతలు చేపట్టిన తొలి సినిమాలోనే శివ నిర్వాణ సస్పెన్స్ ను బాగా నడిపించాడు. క్లైమాక్స్ ఎవరూ ఊహించని రీతిలో ముగుస్తుంది. ప్రేమికులుగా..పెళ్ళి అయిన తర్వాత జరిగే సంఘర్షణలో అటు నాని..నివేథా థామస్ ల యాక్షన్ బాగుంది. ఆది పినిశెట్టి, మురళీ శర్మ, తనికెళ్ళ భరణిలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సినిమా ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ లో స్పీడ్ ఉంటుంది. ప్రత్యేకంగా కామెడీ కోసం సినిమాలో ఎలాంటి పాత్రలు చొప్పించకపోయినా అక్కడక్కడ కామెడీ..డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిన్ను కోరి సినిమా యూత్ ను ఆకట్టుకోవటం ఖాయం. మొత్తానికి నిన్ను కోరితో నాని మరో హిట్  తన ఖాతాలో వేసుకున్నట్లే.

రేటింగ్. 3.25/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here