Home Cinema ‘నేనే రాజు..నేనే మంత్రి’ మూవీ రివ్యూ

‘నేనే రాజు..నేనే మంత్రి’ మూవీ రివ్యూ

nene raju..nene mantri

బాహుబలి వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రానా నటించిన చిత్రం. నేనే మంత్రి..నేనే రాజు. శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా దర్శకుడు తేజ. ఆయన సినిమాలు చేయకే కొన్ని సంవత్సరాలు అయింది. అలాంటిది బాహుబలి సినిమాతో పిచ్చపీక్ లో ఉన్న హీరో రానాను పెట్టి సినిమా అంటే మామూలు విషయం కాదు కదా. ఇక హీరోయిన్  కాజల్ విషయానికి వస్తే అప్పుడప్పుడు ఒడిదుడుకులు ఎదురైనా ఆమె సినిమా బాగానే ఆడుతూనే ఉంది. మరి వీరందరి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా నేనే రాజు..నేనే మంత్రి శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఫలితం ఎలా ఉందో ఓ సారి చూద్దాం..సినిమా అసలు కథ విషయానికి వస్తే జోగేంద్ర(రానా దగ్గుబాటి)కి తన భార్య రాధ(కాజల్) అంటే అపారమైన ప్రేమ. ఎలాంటి తాకట్టు లేకుండా అప్పు ఇవ్వడు ఈ జోగేంద్ర. జోగేంద్రకు భిన్నమైన శైలి రాధది. ఎదుటి మనిషి కష్టాల్లో ఉంటే ఏ మాత్రం ఆలోచించకుండా సాయం చేసేందుకు ముందు ఉంటుంది ఆమె. పెళ్లి అయిన మూడు సంవత్సరాల  తర్వాత రాధ గర్భవతి అవుతుంది. కానీ ఆనందం వారి జీవితంలో ఎంతో సేపు నిలబడదు.

                              ఊరి సర్పంచ్ భార్యతో జరిగిన గొడవలు రాధ కడుపులో బిడ్డ చనిపోతుంది. సర్పంచ్ భార్య వల్లే తన భార్యకు ఇలా జరిగిందన్న కోపంతో జోగేంద్ర సర్పంచ్ ను చంపి ఊరి సర్పంచ్ అవుతాడు. తన పెత్తనానికి అడ్డొస్తున్నాడని ఎమ్మెల్యేను చంపి ఎమ్మెల్యే అవుతాడు. అలా వరస పెట్టి రాజకీయ లక్ష్యాలు పెట్టుకుని ముందుకు సాగుతాడు. ఒకప్పుడు రాధ ప్రేమ కోసం తపించిన జోగేంద్ర..తర్వాత పదవులపై మోజు పెంచుకుంటూ ముందుకు పోతాడు. తన ప్రేమ కోసం ఇలా కఠినాత్ముడుగా  మారిన జోగేంద్రను రాధ ఏం చేసింది..? చివరకు జోగేంద్ర ముఖ్యమంత్రి అయ్యాడా..? లేక రాధ కోరుకున్నట్టుగా మనిషిగా మారాడా..? అన్నది వెండితెర మీద చూడాల్సిందే. వర్తమాన రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎన్నింటినో ఇందులో జొప్పించటంతో ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుంది. దగ్గుబాటి రానా తన జోగేంద్ర పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.

                              ఓ వైపు వడ్డీ వ్యాపారీగా.. తన గెలుపు కోసం ఎంతకైనా తెగించే రాజకీయ నాయకుడిగా రెండు వేరియేషన్స్ చాలా బాగా చూపించాడు. హీరోయిన్ గా కాజల్ ఆకట్టుకుంది. సినిమా అంతా హుందాగా చీరలో కనిపిస్తూనే.. అందం అభినయం తో ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లోనూ తనదైన నటనతో మెప్పించింది. బలమైన హీరోయిన్ క్యారెక్టర్ తో పాటు హీరోనే సినిమా అంతా విలన్ గా నడిపించాడు. తొలి భాగం ఎమోషన్స్, పొలిటికల్ స్ట్రాటజీస్ తో స్పీడుగా నడిపించిన దర్శకుడు ద్వితాయార్థంలో సినిమా కాస్త మెల్లగా సాగింది. టైటిల్ సాంగ్ తో అనూప్ ఫుల్ మార్క్స్ సాధించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను మరింతగా ఎలివేట్ చేసింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కేథిరిన్ పాత్ర కూడా పరిమితమే అయినా..ఓకే అన్పించింది. ఓవరాల్ గా నేనే రాజు..నేనే మంత్రి సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రేటింగ్. 3/5

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here