Home Andhra Pradesh చంద్రబాబు బ్రాండ్ కు ‘చిల్లు పడింది’

చంద్రబాబు బ్రాండ్ కు ‘చిల్లు పడింది’

jagan chamber

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక బ్రాండ్ అంబాసిడర్ అవసరం లేదు. నేనే ఏపీ బ్రాండ్ అంబాసిడర్. ఇది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలుమార్లు బహిరంగంగా చెప్పిన మాట. ఇప్పుడు చంద్రబాబు బ్రాండ్ కే ‘చిల్లు పడింది.’ ఆంధ్రప్రదేశ్ లోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలను కట్టింది ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ వంటి అగ్రశ్రేణి సంస్థలు. వేగం పేరు చెప్పి ఈ సంస్థలకు టెండర్ లో పేర్కొన్న దానికంటే  50 కోట్ల రూపాయలకుపైగా  ఎక్కువే చెల్లించేందుకు సర్కారు అంగీకరించింది. అయినా ఇవి షెడ్యూల్ ప్రకారమే పూర్తయ్యాయి. సచివాలయంలో అన్నీ ఇరుకు ఇరుకు గదులు. మంత్రుల ఛాంబర్లు మొదలుకుని అధికారుల ఛాంబర్ల వరకూ అదే పరిస్థితి. చివరకు కట్టిన గోడలు మళ్ళీ పగలగొట్టి మంత్రుల ఛాంబర్లు విస్తరించారు. ఇదీ సచివాలయం పరిస్థితి. ఇక అసెంబ్లీ పరిస్థితి అయితే చెప్పుకునేందుకు ఎన్నో. కనీసం మంత్రులు..ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలకు సరైన టాయిలెట్లు కూడా లేవు. బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అయితే ‘కాలేజీలు కట్టే వారికి ’ బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుంది అంటూ మంత్రి నారాయణపై అప్పట్లోనే విమర్శలు గుప్పించారు. కోట్ల రూపాయలు వెచ్చించి కట్టిన సచివాలయం, అసెంబ్లీ పరిస్థితి ఒక్క వర్షానికే అతలాకుతలం అయిపోయింది. మంగళవారం నాడు అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత ఛాంబర్ లోకి వర్షపు నీరు భారీ ఎత్తున కారటం..దీని కోసం బకెట్లు పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.

                                ప్రతిపక్ష నేత ఛాంబరే కాదు..ఏకంగా సభా నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ఛాంబర్ తో పాటు పలు గదుల్లోకి నీరు వచ్చి చేరింది. ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. రికార్డు స్థాయిలో..అద్భుతంగా తాము తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయ భవనాలు కట్టామని చంద్రబాబు గొప్పగా చెబుతుంటే..నింకా నిండా ఏడాది కూడా పూర్తి కాని భవనాల్లోకి నీరు కారటం ఏపీ బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ఇమేజ్ కు చిల్లు పెట్టినట్లు అయింది. ఈ భవనాలపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనికి కారణమైన మంత్రి నారాయణపై ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జగన్ ఛాంబర్ లోకి నీళ్ళు కారుతున్న వీడియో సోషల్ మీడియాలో చూసిన వారంతా జోక్స్ పేల్చారు. ప్రభుత్వం పులివెందులకు నీరిస్తా..నీరిస్తా అని చెబుతుంటే తాము ఏమో అనుకున్నామని..కానీ పులివెందుల ఎమ్మెల్యేకు ఇలా నీరిస్తారని తమకు తెలియదంటూ వ్యంగోక్తులు విసిరారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here