Home Telugu పార్టీలు..మీడియాకు షాకిచ్చిన మోడీ

పార్టీలు..మీడియాకు షాకిచ్చిన మోడీ

narendra_modi

ప్రధాని నరేంద్రమోడీ షాకిచ్చారు. దేశంలోని రాజకీయ పార్టీలు..జాతీయ మీడియాకు షాకిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఎవరికి తోచిన ఊహగానాలు వాళ్లు చేశారు కానీ..ఎన్టీఏ ప్రకటించే అభ్యర్థి ఎవరో అన్నది ఎవరూ కనీసం పసిగట్టలేకపోయారు. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి ఉండేది కాదు. కనీసం చర్చల్లో వచ్చిన పేరు ఏదో ఒకటి ఫైనల్ అయ్యేది. కానీ ఈ సారి మాత్రం అసలు ఎవరూ ఊహించని రీతిలో ఎన్డీఏ తన రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఈ వ్యవహారం అంతా చూస్తే ప్రధాని నరేంద్రమోడీ…బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ లే నడిపించినట్లు కన్పిస్తోంది. ఎవరూ ఊహించని రీతిలో భారత నూతన రాష్ట్రపతి అభ్యర్థిగా దళిత నాయకుడి పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ గవర్నర్‌ రామనాథ్‌ కోవింద్‌ పేరు ఖరారు చేసినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలిపారు. బిజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో కోవింద్‌ పేరును ప్రకటించారు. అందరితో చర్చించిన తర్వాతే ఆయనను అభ్యర్థిగా ప్రకటించామని చెప్పారు. ఉప రాష్ట్రపతి అభ్యర్థుల ఎంపికపై చర్చించలేదని తెలిపారు. 23న రామనాథ్‌ కోవింద్‌ నామినేషన్‌ వేసే అవకాశముంది.
                         ఎన్డీఏ పక్షాలకు  సైతం అమిత్ షా ప్రకటించే వరకూ ఈ పేరును ఊహించలేకపోయాయి. దళిత నాయకుడైన రామనాథ్‌ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఉన్న డేరాపూర్‌‌. 1945, అక్టోబర్‌ 1న జన్మించిన ఆయన జన్మించారు. వృత్తిరీత్యా ఆయన న్యాయవాది. 1994-2006 మధ్య కాలంలో రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. 2015 నుంచి బిహార్‌ గవర్నర్‌గా ఉన్నారు. గతంలో బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా నాలుగేళ్లు పనిచేశారు. ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. రాజ్‌నాథ్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలకంగా వ్యవహరించారు. పేరు ప్రకటించిన తర్వాత ప్రధాని మోడీ, అమిత్ షాలు ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here