Home Andhra Pradesh లోకేష్ శాఖలో ‘అన్నీ ఆయనే’!

లోకేష్ శాఖలో ‘అన్నీ ఆయనే’!

Nara-Lokesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటిలో ఇప్పుడిప్పుడే పరుగు ప్రారంభిస్తోంది. కొత్తగా మధ్యతరహా ఐటి సంస్థలతో పాటు..హెచ్ సీఎల్ టెక్నాలజీ వంటి అగ్రశ్రేణి సంస్థ కూడా అమరావతివైపు దృష్టి సారిస్తున్నాయి.  ఇది ఖచ్చితంగా ఏపీ ఐటికి సానుకూల పరిణామమే. కొత్తగా ఐటి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ భారీ లక్ష్యాలే పెట్టుకున్నారు. అయితే ఆ శాఖలో జరుగుతున్న పరిణామాలపై మాత్రం ఆ శాఖ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఐటి శాఖకు పూర్తి స్థాయి కార్యదర్శి కూడా లేరు. కె. విజయానంద్ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు మాత్రమే  నిర్వర్తిస్తున్నారు. ఆయన ఓ వైపు విద్యుత్ సంస్థ ల ఎండీగా వ్యవహరిస్తూనే ఐటి శాఖ బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయి కార్యదర్శి ఉంటే ఆ ఫోకస్ వేరుగా ఉంటుందని ఐటి శాఖ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

                       ఇదిలా ఉంటే.. ఐటి శాఖలో ఒకే వ్యక్తికి  మూడు అత్యంత కీలకమైన  పోస్టులు కట్టబెట్టడం ఆ శాఖ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.  వెంకటాచలం అనే ఏపీటీఎస్ అధికారికి  ఐటి శాఖలో ఏకంగా ఇన్ ఫ్రా స్ట్రక్చర్ జాయింట్ డైరక్టర్, జాయింట్ డైరక్టర్.. కమ్యూనికేషన్స్, జాయింట్ సెక్రటరీ, హెచ్ఆర్ డీ బాధ్యతలు అప్పగించారు. ఒకే వ్యక్తికి ఇన్ని కీలక పదవులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆ శాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే ప్రశ్నలు ఆయనే వేసుకుని..జవాబులు కూడా ఆయనే రాసుకున్న చందంగా ఉందనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే శాఖలో ఉన్న ఆయన పలు బాధ్యతలు నిర్వహిస్తున్నందున కొనుగోళ్లలో పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here