Home Andhra Pradesh జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ కామెంట్

జూనియర్ ఎన్టీఆర్ పై లోకేష్ కామెంట్

Nara-Lokesh

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై కామెంట్ చేశారు. ఎన్టీఆర్‌తో తనకు  ఎటువంటి విభేదాలు లేవని  అన్నారు. పార్టీ కోసం పనిచేసేందుకు ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో ఓ సారి మాత్రం ‘పార్ట్ టైమ్ పాలిటిక్స్’ కుదరదని..పార్టీలోకి వస్తే పూర్తి స్థాయిలో పనిచేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ గురించి లోకేష్ మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. ఆయన అమరావతిలో వివిధ అంశాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఇస్తామని చెప్పారని లోకేష్ అన్నారు. కానీ సమయానికి రాకపోతేనే ఇబ్బంది ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

                         2019 నాటికి రాజధాని, పోలవరం నిర్మిస్తామన్నారు. బీజేపీతో టీడీపీకి ఎటువంటి విభేదాలు లేవని తెలిపారు. ఉనికి కోసమే బీజేపీతో కలుస్తామంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని విమర్శించారు. పవన్‌కళ్యాణ్‌తో సత్సంబంధాలు ఉన్నాయని లోకేష్ అన్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే బాధ కలుగుతుందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నిరూపించమని సవాల్ చేస్తే ఒక్కరూ రాలేదని మంత్రి లోకేష్ అన్నారు. దుష్ప్రచారం చేయటానికే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

నంద్యాలలో వంద శాతం విజయం టీడీపీదేనన్నారు. జగన్ రౌడీషీటర్ మనస్తత్వం అని లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీనే గెలుస్తుందని..చంద్రబాబే సీఎం అవుతారని పేర్కొన్నారు. మంత్రి అయ్యాక పార్టీకి సమయం కేటాయించలేకపోతున్న విషయం వాస్తవమే అన్నారు. మంత్రులు..ఎమ్మెల్యేలను వెయిట్ చేయించుతున్నాననేది నిజం కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 25 సీట్లు కూడా రావన్నారు. పార్టీలో హ్యూమన్ టచ్ పోయిందనేది కూడా సరికాదని వ్యాఖ్యానించారు. బిజీ షెడ్యూల్ వల్ల ఫ్యామిలీని మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here