Home Andhra Pradesh ‘నంద్యాల’వైపు చూడని నారా లోకేష్

‘నంద్యాల’వైపు చూడని నారా లోకేష్

lokesh

ఎందుకు?. అలా ఎందుకు జరగుతోంది.టీడీపీ భవిష్యత్ నేత అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఉప ఎన్నికలో తన వంతు చెయ్యి ఎందుకు వేయలేకపోతున్నాడు?. ముఖ్యమంత్రి చంద్రబాబుకు..మంత్రి నారా లోకేష్ కు ఏమైనా అనుమానాలు ఉన్నాయా?.  కష్టాల్లో ఉన్న ఏపీని ఇప్పటికే గాడినపెట్టేశామని..తాము తప్ప ఎవరు గెలుస్తారనే ధీమా వ్యక్తం చేసే నారా లోకేష్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకు నంద్యాల వైపు చూడటం లేదు. ఓడిపోతే మళ్లీ ఆ అపప్రద తాను మూటుకట్టుకోవాల్సి వస్తుందనా?. మరి గెలిస్తే ఆ క్రెడిట్ ఆయన కూడా కొట్టేయవచ్చు కదా?. అత్యంత ఉత్కంఠ పోరు నెలకొన్న నంద్యాలతో ఎందుకు నారా లోకేష్ పాల్గొనటంలేదనే అంశం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా కూడా మారింది.

                                       ప్రభుత్వంలో, పార్టీలో  చక్రం తిప్పుతున్న లోకేష్ ను ఎవరైనా దూరం పెట్టారా?. లేక ఆయనే దూరంగా ఉన్నారా? అన్న చర్చ టీడీపీలోనూ సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు అక్కడే మకాం వేసి ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మంత్రులు..ఎమ్మెల్యేలు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.  అయినా నారా లోకేష్ అటువైపు తిరిగిచూకపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. వైసీపీ దీనిపై విమర్శలు కూడా ఎక్కుపెడుతోంది. కృత్రిమ నేత నారా లోకేశ్‌ ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు ఎందుకో? అని వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here