Home Cinema జూలై 7న నాని ‘నిన్ను కోరి’

జూలై 7న నాని ‘నిన్ను కోరి’

Nani Hero

నాని అంటే హిట్. హిట్ అంటే నాని. అలా ఉంది టాలీవుడ్ లో నానీ హవా. అందులో భారీ వ్యయాలకు ఏ మాత్రం వెనకాడని నిర్మాత డీ వీ వీ దానయ్య. ఆయన నిర్మించిన సినిమా ‘నిన్నుకోరి’ వచ్చే నెలలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో నాని సరసన ఇప్పటికే ఈ కుర్రహీరోతో ఓ సారి జత కట్టి హిట్ కొట్టిన నివేదా ధామస్ నటిస్తోంది. బన్నీ సినిమా సరైనోడులో నెగిటివ్ రోల్ పోషించి మంచి మార్కులు వేయించుకున్న ఆది పినిశెట్టి కూడా  ఈ సినిమాలో ఉన్నారు.

                         ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో రిలీజ్‑కు రెడీ అవుతున్న ఈ సినిమా థియట్రికల్ ట్రైలర్‑ను చిత్రయూనిట్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై 7న రిలీజ్ అవుతోంది.

థియేట్రికల్ ట్రైలర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here