Home National చిక్కుల్లో మహేంద్రసింగ్ ధోనీ

చిక్కుల్లో మహేంద్రసింగ్ ధోనీ

dhoni

భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ చిక్కుల్లో పడ్డారు. ధోనీ శ్రీనివాసన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని..ఆయనకు వందల కోట్ల రూపాయలు ముట్టాయనే ఆరోపణలు ఒక్కసారిగా కలకలం రేపాయి. ఇవి కేవలం ఆరోపణలే కాకుండా ఓ లేఖ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇండియా సిమెంట్స్ అధినేత, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌ తన కంపెనీలో ధోనీకి ఉద్యోగం ఇచ్చిన వివరాలను ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ బహిర్గతం చేశారు. ధోనీ, శ్రీనికి మధ్య ఎన్నో కాంట్రాక్టులలో సంబంధాలు ఉన్నాయని ఈ జాబ్ వెనక అసలు ఉద్దేశమిదేనని ఆయన తెలిపారు.

                     ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. 2012 జూన్‌లో ధోనీని ఇండియా సిమెంట్స్‌ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు ఓ ఆఫర్ లెటర్‌ను మోడీ బయటపెట్టారు. దీని ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది. ఇండియా సిమెంట్స్‌ లో పనిచేసిన ధోనీ శ్రీనివాసన్ కంపెనీ ఉద్యోగిగా వందల కోట్లు ఆర్జించానని అంగీకరిస్తాడా అని ప్రశ్నించారు.  రాజస్థాన్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్న లలిత్ మోడీ కుమారుడు రుచిర్ మోడీ ఈ ఆఫర్ లెటర్‌పై స్పందించారు. బీసీసీఐలో ఇలాంటివి జరగడంపై షాక్‌కు గురయ్యానని, చెన్నై సిమెంట్స్ ఉద్యోగిగా ధోనీ ఏడాదికి వందకోట్లు ఆర్జిస్తున్నాడని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here