Telugu Gateway
Movie reviews

డీ జె టిల్లు మ్యాజిక్ రిపీట్ అయిందా?!(Tillu Square Movie Review)

డీ జె టిల్లు మ్యాజిక్ రిపీట్ అయిందా?!(Tillu Square  Movie Review)
X

సినిమాల్లో కామెడీ చేయాలంటే కమెడియన్స్ ఉండాలి. దీనికి ఓ పెద్ద తతంగం కావాలి. కానీ ఒక హీరో తన మాటలతోనే కామెడీ చేయటం...అయన మాట్లాడే ప్రతి మాట కామెడీ గా ఉండటం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. టాలీవుడ్ లో ఇప్పటివరకు యాక్షన్స్ తో పాటు మాటలతో ఈ రేంజ్ కామెడీ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా సిద్దు జొన్నలగడ్డ అనే చెప్పొచ్చు. ఏ మాత్రం అంచనాలు లేకుండా 2022 ఫిబ్రవరి లో విడుదల అయిన డీజె టిల్లు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో తెలిసిందే. డీ జె టిల్లు లో సిద్దు, నేహా శెట్టి రాధిక పాత్రలు ఇప్పటికి ప్రేక్షకుల కు గుర్తున్నాయి. డీ జె టిల్లు కు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ ఉంటుంది అని ప్రకటించగానే దీనిపై అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి. మరో వైపు ఇందులో రాధిక పాత్రలో దుమ్మురేపిన నేహా శెట్టి కాకుండా టిల్లు 2 లో అనుపమ పరమేశ్వరన్ ని తీసుకోవటంతో ప్రేక్షకులు ఒకింత షాక్ కు గురయ్యారని చెప్పాలి. పలు మార్లు వాయిదా పడిన టిల్లు స్క్వేర్ ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాత కథను ..టిల్లు స్క్వేర్ కు కనెక్ట్ చేస్తూ సినిమా తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే కథ కంటే కూడా ఓన్లీ సిద్దు. అనుపమ పరమేశ్వరన్ ల మధ్య వచ్చే సంభాషణలే సినిమా లో హై లైట్ . టిల్లు స్క్వేర్ లో కూడా సిద్దు చెప్పే ప్రతి మాట ప్రేక్షకులను నవ్విస్తుంది.

అయితే టిల్లు స్క్వేర్ చూసిన తర్వాత నేహా శెట్టి కాకుండా అనుపమ పరమేశ్వరన్ ను తీసుకుని తప్పు చేసారా అన్న ఫీలింగ్ ప్రేక్షకులకు ఏ మాత్రం ఉండదు అనే చెప్పాలి. ఇందులో ఆమె ఒక వైపు హాట్ గా కనిపిస్తూనే యాక్షన్ సన్నివేశాలు..ట్విస్ట్ ల్లో మంచి నటన కనపర్చింది. డీ జె టిల్లు లో రాధిక ..టిల్లు ను ప్రేమించి మోసం చేస్తే...టిల్లు స్క్వేర్ లో లిల్లీ మోసం చేయటానికే టిల్లు ను ప్రేమిస్తది. టిల్లు 2 లో రాధిక కూడా కొద్ది సేపు మెరుస్తుంది. ఆమె ఎంట్రీ సమయంలో థియేటర్ లు దద్దరిల్లాయనే చెప్పాలి. ఎందుకంటే డీ జె టిల్లు సినిమా లో ఆమె పాత్ర ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపించింది. ఇక టిల్లు స్క్వేర్ విషయానికి వస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెన్త్ ఎంటర్టైన్ మెంట్ మూవీ. అయితే హీరో సిద్దు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ల మధ్య వచ్చే లిప్ లాక్ సన్నివేశాల డోస్ పెరిగినట్లు కనిపిస్తుంది. ఇవి మినహాయిస్తే టిల్లు స్క్వేర్ మూవీ దెబ్బకు థియేటర్లు దద్దరిల్లాయనే చెప్పాలి. దర్శకుడు మల్లిక్ రామ్ డీ జె టిల్లు సినిమా ట్రాక్ ఏ మాత్రం తప్పకుండా టిల్లు స్క్వేర్ ను కొనసాగించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే యూత్ టార్గెట్ గా తీసిన సినిమా ఇది.దీంతో సిద్దు మరో సూపర్ హిట్ అందుకున్నాడు.

రేటింగ్ . 3 . 5 /5

Next Story
Share it