Home Top Stories 2030క‌ల్లా చంద్రుడి నుండే ఇంధనం !

2030క‌ల్లా చంద్రుడి నుండే ఇంధనం !

moon

ప‌్ర‌పంచ‌మంతా నోరెళ్ల‌బెట్టేలా.. ఒక్కో విజ‌యం సాధిస్తూ వెళ్తున్న ఇస్రో తాజాగా మ‌రో ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2030క‌ల్లా మ‌న దేశానికి అవ‌స‌ర‌మైన శ‌క్తినంత‌టినీ చంద్రుని నుంచే రాబ‌ట్టేలా ప్ర‌ణాళిక ర‌చిస్తున్న‌ది. చంద్రునిపై ఉన్న హీలియం నిల్వ‌ల నుంచే మ‌న‌కు కావాల్సిన విద్యుత్‌ను ఉత్ప‌త్తి చేసుకోవ‌చ్చ‌ని ఇస్రో సీనియ‌ర్ శాస్త్ర‌వేత్త శివ‌థాను పిళ్లై వెల్ల‌డించారు. 2030క‌ల్లా ఈ ల‌క్ష్యం నెర‌వేరుతుంద‌ని కూడా ఆయ‌న స్ప‌ష్టంచేశారు. అబ్జ‌ర్వ‌ర్ రీసెర్చ్ ఫౌండేష‌న్ (ఓఆర్ఎఫ్‌) నిర్వ‌హిస్తున్న మూడు రోజుల‌ క‌ల్ప‌నా చావ్లా స్పేస్ పాల‌సీ చ‌ర్చ‌ల్లో భాగంగా పిళ్లై త‌న అభిప్రాయాలు పంచుకున్నారు.

                         చంద్రునిపై హీలియం నిల్వ‌లు స‌మృద్ధిగా ఉన్నాయ‌ని, అక్క‌డ మైనింగ్ నిర్వ‌హించ‌డ‌మే ఇస్రో ప్ర‌ధాన ల‌క్ష్యాల్లో ఒక‌ట‌ని ఆయ‌న వెల్ల‌డించారు.  ఇత‌ర దేశాలు కూడా ఇప్ప‌టికే ఈ దిశ‌గా ప్ర‌ణాళిక‌లు మొద‌లుపెట్టాయ‌ల‌ని, ప్ర‌పంచానికంత‌టికీ స‌రిప‌డా శ‌క్తినిచ్చే హీలియం నిల్వ‌లు చంద్రునిపై ఉన్నాయ‌ని పిళ్లై తెలిపారు. వ‌చ్చే కొన్ని ద‌శాబ్దాల్లో చంద్రుని మీదికి హ‌నీమూన్‌కు కూడా వెళ్తార‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక లెఫ్ట్‌నెంట్ జ‌న‌ర‌ల్ పీఎం బాలి మాట్లాడుతూ.. అంత‌రిక్షాన్ని దేశ ర‌క్ష‌ణ కోసం ఏవిధంగా వాడుతున్నామో చెప్ప‌డానికి ఇస్రో ప్ర‌యోగించిన సీశాట్‌-7 నిద‌ర్శ‌న‌మ‌ని అన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here