Home Andhra Pradesh రైతు రుణ మాఫీపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

రైతు రుణ మాఫీపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

modugula

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేశంలో ఎక్కడా చేయని విధంగా తాము రుణ మాఫీ చేశామని చెబుతుంటే..ఆయన మాటలకు భిన్నంగా టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించటం పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. రైతుకు రుణమాఫీ పూర్తి స్థాయిలో జరగలేదని టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు భేషరతుగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పలు ఆంక్షలు పెట్టి ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన కొంత మంత్రుల తీరును కూడా తప్పుపట్టే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారు.  

                              గుంటూరు జిల్లాలో రియల్టర్లు లక్షల హెక్టార్ల ఎకరాల్లో లే-అవుట్లు వేసి.. రైతుల ముసుగులో ఎరువుల సబ్సిడీలు పొందుతున్నారని ఆయన ఆరోపించారు. నకిలీ విత్తనాలకు గుంటూరు జిల్లా అడ్డాగా మారిందని విమర్శించారు. ఎరువుల మిక్సింగ్ ప్లాంట్లలో కల్తీ జరుగుతోందని అన్నారు. ప్రచారాల కోసమే సోదాలు చేస్తున్నట్లుగా ఉందని మోదుగుల వ్యాఖ్యానించటం జిల్లా టీడీపీలో దుమారం రేపింది. ఆయన గత కొంత కాలంగా అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆయన తాజా వ్యాఖ్యలు దీన్ని మరింత బలపర్చేలా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here