Home Uncategorized నెహ్రు, ఇందిరా తర్వాత అంతటివాడు మోడీ !

నెహ్రు, ఇందిరా తర్వాత అంతటివాడు మోడీ !

Modi

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో అత్యంత విజయవంతమైన మూడో ప్రధాని కాబోతున్నారని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహా తెలిపారు. మాజీ ప్రధానులు జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల తర్వాత మోదీనే విజయవంతమైన ప్రధాని అని చెప్పారు. మోదీ చరిష్మా, ఆకర్షణీయత,  మతం, భాష అనే హద్దులను కూడా చెరిపేస్తోందని తెలిపారు. దిల్లీలో జరిగిన లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ ఇండియా సమావేశం 2017 కార్యక్రమంలో పాల్గొన్న రామచంద్ర గుహా తన ప్రసంగంలో మోదీని ప్రశంసించారు. మోదీ తన నిర్ణయాలు తీసుకునే అధికారం, ముందుచూపు వల్లే ఆ స్థాయికి వెళ్లారన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత ఆ స్థాయిలో అధికారం, చరిష్మా, కుల మత భాషా బేధాలు లేకుండా ప్రజలను ఆకర్షించిన భారత ప్రధాని ఎవ్వరూ లేరని గుహా అన్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here