Home Andhra Pradesh ‘అమరావతి’ ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణంలోనూ బిగ్ స్కామ్!

‘అమరావతి’ ఎమ్మెల్యేల ఇళ్ల నిర్మాణంలోనూ బిగ్ స్కామ్!

mla appartments

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ సర్కారు తీరు. సాక్ష్యాత్తూ చట్టసభ సభ్యులు…ఐఏఎస్ అధికారుల కోసం నిర్మించే ఇళ్ళలోనూ బిగ్ స్కామ్ కు బీజం వేసినట్లు కన్పిస్తోంది. అంచనాలు తయారు చేసేది ఇంజనీర్లే అయినా…వాటిని నడిపించేది మాత్రం ప్రభుత్వంలోని పెద్దలే అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు అమరావతిలో అంతా ‘బాస్’ల సూచనల మేరకే ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కాంట్రాక్ట్ లు మొదలుకుని..ఏ పని అయినా ఎవరికి ఇవ్వాలో ముందే డిసైడ్ చేస్తున్నారు. పేరుకే టెండర్లు..హంగామా. కానీ తెరవెనక కథ మాత్రం కామ్ గా చేసుకుంటూ పోతున్నారు. తాజాగా శనివారం నాడు ఏపీసీఆర్డీఓ పత్రికల్లో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని సారాంశం ఏమిటంటే 18 టవర్స్ కింద ప్రజా ప్రతినిధులు..ఐఏఎస్ లకు 609 కోట్ల రూపాయలు వెచ్చించి 432 అపార్ట్ మెంట్లను నిర్మించనున్నారు.  ఈ లెక్కన చూస్తే ఒక్కో అపార్ట్ మెంట్  వ్యయం 1.40 కోట్ల రూపాయలుగా పడుతుంది.

                               అంటే భూమి ధర లేకుండానే కేవలం నిర్మాణ ఖర్చులకే అపార్ట్ మెంట్ కు 1.40 కోట్ల రూపాయల ధర దారుణమని..హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో చూసినా భూమి ధరతో కలుపుకుని అంత  ప్రీమియం అపార్ట్ మెంట్ వస్తుందని  ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు. మరి అలాంటిది అమరావతిలో కేవలం నిర్మాణానికే 1.40 కోట్ల రూపాయల ధర నిర్ణయించటం అంటే ఇది స్కామే అనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఒక్కో అపార్ట్ మెంట్ మూడు వేల చదరపు అడుగుల్లో నిర్మించినా అడుగుకు నాలుగు వేల ధర వేసుకున్నా..ఆ మొత్తం 1.20 కోట్ల  రూపాయలు దాటదు. భూమితో కలుపుకుని అడుగు నాలుగు వేల ధరతో  హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లోనే అపార్ట్ మెంట్లు వస్తాయి. అలాంటిది కొత్తగా నిర్మించే ఈ ప్రాంతంలో ఈ ధర నిర్ణయించటం దారుణమని చెబుతున్నారు. ప్రభుత్వ పెద్దల స్కెచ్ మేరకే ఈ ధర నిర్ణయించారని..ఇది కూడా ఓ బిగ్ స్కామ్ గా నిలవనుందని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here