Home Telugu మైనర్ భార్యతో శృంగారం రేప్ కిందే లెక్క

మైనర్ భార్యతో శృంగారం రేప్ కిందే లెక్క

supreme-court

సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్ భార్యతో శృంగారం రేప్ కిందే లెక్క అని తెలపింది. బాల్యవివాహలపై నిషేధం ఉన్నందున అలాంటి చర్యలను రేప్ గానే పరిగణించాల్సి ఉంటుందని పేర్కొంది. మైనర్‌(18 ఏళ్లు నిండని) భార్యపై భర్త జరిపే లైంగిక చర్యను ముమ్మాటికీ నేరంగానే పరిగణించాలని, దానిని అత్యాచారంగానే భావించాలని చెప్పింది.

                            బాల్యవివాహాలపై నిషేధం కొనసాగుతున్నప్పటికీ తరచూ అలాంటివి చోటుచేసుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రాధాన్యం సంతరించుకుందని భావిస్తున్నారు. అరుదైన కేసులను ఉటంకిస్తూ ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన ఇద్దరు సభ్యుల సుప్రీం ధర్మాసనం బుధవారం ఈ తీర్పు చెబుతూ భారత శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్ 375పై ఈ మేరకు వివరణ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here