Home Andhra Pradesh దళితులపై మంత్రి ‘ఆది’ వివాదస్పద వ్యాఖ్యలు

దళితులపై మంత్రి ‘ఆది’ వివాదస్పద వ్యాఖ్యలు

adinarayana reddy

జంప్ జిలానీ మంత్రి ఆదినారాయణరెడ్డి దళితులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అదీ స్వాతంత్ర దినోత్సవం రోజునే. ఆయన ఆదివారం వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మాట్లాడారు. ‘‘దళితులు శుభ్రంగా ఉండరు. సరిగ్గా చదువు కూడా రాదు. కానీ వాళ్లే సూపరింటెండెంట్లు అయిపోతారు.

                         ఏదో వెనుకబడ్డారని అప్పట్లో ఓ 10 ఏళ్లు అంబేద్కర్‌ వల్ల రిజర్వేషన్లు వచ్చాయి. 10 ఏళ్లు పోయాయి.. 70 ఏళ్లు పూర్తయ్యాయి. అయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఎన్ని వసతులు కల్పించినా ఎస్సీలు మారలేదు. ఇంకా వెనుకబడ్డారంటే అందుకు కారణం వాళ్లే’’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. మంత్రి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here