Home Latest News దిగ్విజయ్ సింగ్‌కు పరీకర్ కృతజ్ఞతలు

దిగ్విజయ్ సింగ్‌కు పరీకర్ కృతజ్ఞతలు

manohar parikar

గోవాలో బీజేపీ అధికారంలోకి రావడానికి కారణమైనారని విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కృతజ్ఞతలు తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమై, తాను ముఖ్యమంత్రి కావడానికి వీలు కల్పించిందని, అందుకు దిగ్విజయ్‌సింగ్‌కు కృతజ్ఞతలని ఆయన చెప్పారు. ఆయన శుక్రవారం రాజ్యసభకు వచ్చి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, సభ్యులకు వీడ్కోలు పలికారు. తను రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు సభ్యులు అందించిన మద్దతుకు కృతజ్ఞతలు చెప్పారు. వారు కోరుకున్నప్పుడల్లా గోవాకు రావచ్చని పారికర్ ఆహ్వానం పలికారు.

                                 గోవా ముఖ్యమంత్రిగా  ప్రమాణం చేసే ముందు రక్షణమంత్రిగా ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పారికర్ సభలో అడుగుపెట్టగానే కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్‌సింగ్, బీకే హరిప్రసాద్, రాజీవ్‌గౌడ, రజినీ పాటిల్ తదితరులు లేచి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గోవా గవర్నర్ మృదులా సిన్హా బీజేపీని ఆహ్వానించకుండా ఉండాల్సిందన్నారు. ఆమె ప్రవర్తనపై చర్చించడానికి సభలో ఆయన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంపై ఇంకా చర్చించాల్సి ఉంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here