Home Cinema మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ వచ్చేసింది

మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ వచ్చేసింది

Mahesh babu

స్పైడర్. మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ఈ సినిమాలో మహేష్ బాబు..ఆయనకు జోడీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ద్విభాషా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ దీన్ని విడుదల చేయనున్నారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు స్పైడర్ ‘టీజర్’ను విడుదల చేసింది. ఈ చిత్రానికి ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాతగా ఉన్నారు. ఇందులో  ఎస్‌జే సూర్య ప్ర‌తి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు.

                         హీరో మహేష్ బాబు ట్రైలర్ లో  ‘భయపెట్టడం మాకు తెలుసు’ అంటుంటే ..’పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ గ‌వ‌ర్నమెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే’ అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్‌లు టీజ‌ర్‌లో ఉన్నాయి.  స్పైడర్‌ టీజర్‌ను యూట్యూబ్‌లో పోస్టు చేసిన రెండు గంటల్లోనే 44  వేలకు పైచిలుకు హిట్స్‌ వచ్చాయి. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టీజర్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here