Home Cinema ‘బంబాట్’ ఆడిస్తున్న నితిన్

‘బంబాట్’ ఆడిస్తున్న నితిన్

lie-nithin-bombhaat

హీరో నితిన్ ‘బంబాట్’ ఆడిస్తున్నాడు. ఆ..ఆ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఈ కుర్రహీరో ఇప్పుడు ఫుల్ జోష్ లో ‘లై’ అంటూ ముందుకు దూసుకొస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఓ పాటను మంగళవారం నాడు విడుదల చేశారు. నితిన్ హీరోగా 14 రీల్స్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ సంస్థ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్ ఎనిమిటి) తెరకెక్కుతోంది. గస్ట్‌ 11న ఈ సినిమాను  విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. వెంకట్‌ బోయనపల్లి దర్శకత్వంలో గోపీ ఆచంట, రామ్‌ ఆచంట, అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

                                 ఈ సందర్భంగా  నిర్మాతలు మాట్లాడుతూ ‘చికాగోలో ఈ చిత్రం ఫస్ట్‌ సాంగ్‌ ‘బాంబాట్‌’ను చాలా గ్రాండ్‌గా విడుదల చేశాం. మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అమెరికాలోని వివిధ లొకేషన్లలో 75 రోజుల పాట టాకీ, భారీ యాక్షన్ సీన్లు తీశాం. మరో పది రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంటోంది’ అని తెలిపారు. మేఘా ఆకాశ్ హీరోయిన్ గా నటిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here