Home Cinema ‘లై’ మూవీ రివ్యూ

‘లై’ మూవీ రివ్యూ

lie movie review In telugu

అ..ఆ తర్వాత హీరో నితిన్ చేసిన సినిమా ‘లై’. తివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అ..ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించింది. అంతటి విజయం అందుకున్న తర్వాత నితిన్ చేస్తున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగానే ఉంటాయి. ఓ పెద్ద సక్సెస్ తర్వాత వచ్చే ఏ హీరో  సినిమాది అయినా అదే పరిస్థితి. అందులో లై సినిమా దర్శకుడు హను రాఘవపూడి కావటం దీనిపై మరింత క్రేజ్ ను పెంచింది. లై సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అ..ఆ వంటి హిట్ సినిమా తర్వాత విడుదలైన నితిన్ ‘లై’ సినిమా హిట్టా.ఫట్టా.తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే.                 ఇక సినిమా అసలు కథలోకి వస్తే ఏ. సత్యం (నితిన్ ) పనిపాటా లేకుండా పోకిరిగా తిరుగుతుంటాడు. తండ్రి పెన్షన్ కింద వచ్చే డబ్బుతో వాళ్ల ఫ్యామిలీ జీవితం కొనసాగిస్తుంటుంది.  పెళ్లి చేస్తే అయినా తన కొడుకు సెట్ అవుతాడని భావించిన సత్యం తల్లి ఆ ప్రయత్నాలు చేస్తుంది. అవి ఏవీ కూడా ఫలించవు. ఎలాగైనా అమెరికా వెళ్లి ఓ తెల్లపిల్లని పెళ్లి చేసుకుని వస్తానని చెప్పి అమెరికా బయలుదేరుతాడు. కానీ అసలు విషయం ఏమిటంటే సత్యం అమెరికా వెళ్లింది తన  తండ్రిని చిన్నప్పుడే ఓ పబ్ లో గ్యాంగ్ స్టర్స్ కాల్చివేస్తారు. సంబంధం లేని తప్పుకు సత్యం తండ్రి బలవుతాడు.

                           ఆ పగ తీర్చుకోవటానికి పోలీసు అధికారిగా అమెరికాలోని లాస్ వెగాస్ వెళతాడు. ఇక సినిమాలో హీరోయిన్ చైత్ర (మేగా ఆకాష్) తెలుగుతెరపై తొలిసారి మెరిసింది. ఈ సినిమాలో పీనాసి పిల్లగా నటించింది. స్నేహితులు ఫేస్ బుక్ లో  పెట్టిన అద్భుత మైన ఫోటోలు చూసి ఎక్కడివి ఇవి అంటూ ఆరాతీస్తుంది. అమెరికా అని చెప్పగానే..అమెరికా ఎప్పుడు వెళ్ళావు అంటూ స్నేహితురాలని ఆరాతీస్తుంది. పెళ్లి చేసుకుంటేనే అమెరికాతో పాటు ఎక్కడికైనా వెళ్లొచ్చు అంటూ ఆమె స్నేహితురాలి ఇచ్చిన సలహాతో పెళ్లికి రెడీ అయిపోతుంది. పెళ్లి కుదిరినా చివరకు పెళ్ళికొడుకు వచ్చే కారుపై పిడుగు పడటంతో మంచి శకునం కాదని అబ్బాయి తరపు వాళ్ళు వెనక్కివెళ్లిపోతారు. కానీ అప్పటికే లక్షలకు లక్షలు పోసి అమెరికాలోని లాస్ వెగాస్ లో హానీమూన్ కు ప్లాన్ చేసుకున్న చైత్ర పరిస్థితి ఏమిటి?.

                              సత్యం..చైత్రల మధ్య ప్రేమ ఎలా పడుతుంది?. నితిన్ పగ ఎలా తీర్చుకుంటాడు అన్నది వెండితెరపై చూడాల్సిందే. హీరో తండ్రి చేయని తప్పుకు చిన్నప్పుడే చనిపోవటం..పెద్దయ్యాక హీరో పగతీర్చుకోవటం వంటి కాన్సెప్ట్ లతో తెలుగులో వచ్చిన సినిమాలే కోకొల్లలు. మళ్ళీ పాత కథనే హనురాఘవపూడి ఎంచుకుని సక్సెస్ కాలేకపోయారు. ఈ సినిమాలో విలన్ గా చేసిన అర్జున్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. హీరో నితిన్ యాక్షన్ బాగానే ఉన్నా..కథలో దమ్ములేకపోవటం సినిమా కు పెద్ద మైనస్. తొలిసారి నటించినా మేఘా ఆకాష్ ఓకే అన్పించింది. సినిమా రిచ్ గా తెరకెక్కించినా కథే పెద్ద మైనస్. స్టార్టింగ్ నుంచి చివర వరకూ సినిమా స్లోగా సాగుతుంది. ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే కామెడీ అయినా ఉందా? అంటే అదీ లేదు. మొత్తం మీద నితిన్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లై’ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవటం కష్టమే.

 

రేటింగ్. 2.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here