Home Latest News అగ్నిపర్వతం నుండి 150 ఏళ్లకు లావా

అగ్నిపర్వతం నుండి 150 ఏళ్లకు లావా

lava

మన దేశంలోని అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నఏకైక అగ్ని పర్వతం బారెన్ ఐలండ్ వాల్కనో నుండి గత కొద్ది రోజులుగా లావా విడుదలవుతోంది. కానీ అది రాత్రి పూట మాత్రమే జరుగుతోంది. పగటి పూట ప్రతి 10 నిమిషాలకు ఓసారి కొద్ది కొద్దిగా బూడిద, నిప్పు రవ్వలను వెదజల్లుతున్నదట. అగ్ని పర్వతాన్ని పరిశీలించిన గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషియానోగ్రఫీ (ఎన్‌ఐవో) పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ బారెన్ ఐలండ్ వల్కనో గత 150 ఏళ్లుగా నిద్రాణ స్థితిలో ఉందని ఎన్‌ఐవో టీమ్ హెడ్ అభయ్ ముధోల్కర్ తెలిపారు.

                         అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద, లావా ఇతర పదార్థాల శాంపిల్స్‌ను తాము సేకరించామని, వాటిని విశ్లేషిస్తే మరిన్ని వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. కాగా 1991లోనూ ఇలాగే జరిగిందని, అనంతరం కొద్ది రోజులకు బూడిద చిమ్మ‌డం ఆగిపోగా, ఇప్పుడు మళ్లీ మొదలైందని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది. దీని దగ్గరకు వెళ్లాలనుకునే వారికి పోర్ట్‌బ్లెయిర్ నుంచి చార్టర్డ్ బోట్స్ దొరుకుతాయి. అయితే ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి ముందుగా తీసుకోవాల్సి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here