Home Latest News కిస్ అండ్ రన్

కిస్ అండ్ రన్

Rape

కిస్ అండ్ రన్. ఇది పోకరీల కొత్త మోడల్. ఐటి రాజధాని బెంగుళూరులో ఈ ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అమ్మాయిలు కనిపిస్తే  ఏదో ఒక ఆగడాలకు పాల్పడుతున్నారు. బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తున్న యువతికి ఒక ఆగంతకుడు ముద్దు పెట్టి పరారయ్యాడు. ఈ ఘటనతో బాధితురాలు షాక్ కు గురైంది. ఈ ఘటన బెంగళూరు జీవన బీమానగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఉత్తర భారతదేశానికి చెందిన ఓ యువతి నగరంలో ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది.

                         శనివారం రాత్రి తన స్నేహితుల ఇంట్లో పార్టీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆదివారం తెల్లవారుజామున 2.30 సమయంలో బీమానగర బస్టాండు వద్ద క్యాబ్‌ కోసం వేచిచూస్తోంది. ఇంతలో ఒక వ్యక్తి ఆమె దగ్గరగా వెళ్లి యువతి చెంపపై ముద్దుపెట్టి పరారు అయ్యాడు. దీంతో భయాందోళనకు గురైన యువతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనాస్ధలంలో ఉన్న సీసీ టీవీ కెమెరా చిత్రాలను పరిశీలించి పోకిరీని పట్టుకునే పనిలో పడ్డారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here