Home Latest News గణేష్ నిమజ్జనం అక్టోబర్ 5న

గణేష్ నిమజ్జనం అక్టోబర్ 5న

Khairatabad-Ganesh

హైదరాబాద్ లో గణేష్ ఉత్సవాల సందడి మొదలైంది. వినాయకచవితి అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకం ‘ఖైరతాబాద్’ వినాయకుడే. ఈ భారీ వినాయక విగ్రహాం ఏర్పాటు తుదిరూపునకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లోనే బారికేడ్లను తొలగించి..బడా గణేషుడిని భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఖైరతాబాద్ వినాయకుడి స్పూర్తిగా విశాఖ వంటి ప్రాంతాల్లోనూ భారీ వినాయకుడి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. కాకపోతే ఈ పండగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు సందర్శించుకునే ఏకైక వినాయకుడు ఖైరతాబాద్ గణేషుడే. దీంతో సర్కారు కూడా ఏర్పాట్లు మొదలుపెట్టింది.

                         జీహెచ్‌ఎంసీ పరిధిలో గణేశ్‌ చవితి, గణేశ్‌ నిమజ్జనాన్ని శాంతి యుతంగా, ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. నిమజ్జ నాన్ని సెప్టెంబర్‌ 5న ఉదయం నుంచే ప్రారం భించేలా చూడాలని భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. సాయంత్రం లోగా నిమజ్జనం పూర్తి చేయాలని పేర్కొ న్నారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ నిమజ్జనం అదే రోజు నిర్వహించాలని సూచించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here