Home Telangana ‘తెలంగాణ’లో ఉద్యోగాల పండగ..కొత్తగా 29 వేల ఉద్యోగాలు

‘తెలంగాణ’లో ఉద్యోగాల పండగ..కొత్తగా 29 వేల ఉద్యోగాలు

kcr

తెలంగాణలో ఉద్యోగాల పండగకు రంగం సిద్ధం అవుతోంది. ఒకేసారి వివిధ శాఖల్లో ఉన్న 28, 796 పోస్టుల భర్తీకి శనివారం నాడు  సీఎం కెసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అత్యంత కీలకమైన జోనల్‌ విధానాన్ని రద్దు చేయాలని, దీనిపై రాష్ట్రపతి అనుమతి కోరాలని నిర్ణయం తీసుకుంది. ఇక భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కుంభకోణం నేపథ్యంలో రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలు రద్దు చేస్తూ తీసుకువస్తున్న ఆర్డినెన్స్‌ కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పలు రకాల మోసాలను పీడీ యాక్ట్‌ పరిధిలోకి తెస్తూ ఒక ఆర్డినెన్స్‌.. ఆన్‌లైన్‌ పేకాటను నిషేధిస్తూ, వ్యాట్‌ చట్టానికి సవరణలు చేస్తూ మరో రెండు ఆర్డినెన్స్‌ లను మంత్రవర్గం ఆమోదించింది.  కొత్త ఉద్యోగాల విషయానికి వస్తే ఆ శాఖలోని వివిధ విభాగాల్లో 26,290 ఉద్యోగ నియామకాలకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న 8 వేల పోస్టులతో పాటు 18,290 కొత్త పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది.

                                 అయితే  ఈ భర్తీని ఒకేసారి కాకుండా మూడేళ్లలో దశలవారీగా ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు కానిస్టేబుల్‌ మొదలు ఎస్సై, సీఐ, డీఎస్పీల వరకు వివిధ హోదాల్లోని పోస్టులు భర్తీ చేయనుంది.
రెవెన్యూ శాఖలో 2,506 కొత్త పోస్టుల మంజూరుకు కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. సీసీఎల్‌ఏ ఆఫీసులో 21 జూనియర్‌ అసిస్టెంట్లు, 8 డిప్యూటీ కలెక్టర్, 38 డిప్యూటీ తహసీల్దార్, 400 జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, 700 వీఆర్వో, వెయ్యి వీఆర్‌ఏ, 100 డిప్యూటీ సర్వేయర్, 50 కంప్యూటర్‌ డ్రాఫ్ట్‌మన్, 7 జిల్లా రిజిస్ట్రార్, 22 సబ్‌ రిజిస్ట్రార్, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో 50 జూనియర్‌ అసిస్టెంట్‌ ఆఫీసర్, 110 సర్వేయర్‌ పోస్టులకు ఆమోదం తెలిపారు. వెంటనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here