Home Cinema కబాలి విడుదల జూలై 29న !

కబాలి విడుదల జూలై 29న !

కబాలి. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. అయితే ఈ చిత్రం విడుదల తేదీ మాత్రం రోజుకొకటి మారుతోంది. కారణాలు ఏమిటో తెలియదు కానీ విడుదలపై మాత్రం సస్పెన్స్ రాజ్యమేలుతోంది. అయితే సస్పెన్స్ కు తెరదించుకూ కొత్త పోస్టర్లు వెలుగులోకి వచ్చాయి. మలేషియాలో వెలసిన పోస్టర్ల ప్రకారం కబాలి సినిమా జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ కొత్త పోస్టర్లు ఇఫ్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నిర్మాతలు మాత్రం ఇప్పటివరకూ  అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు. ‘సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

మలేసియాలో ఏర్పాటు చేసిన పోస్టర్లు డిస్ట్రిబ్యూటర్లు పెట్టినవ’ని చిత్ర యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తొలుత జూన్ లోనే ఈ సినిమాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. తర్వాత జూలైకి వాయిదా పడింది. ఈ నెల 15నే విడుదల కానున్నట్లు ప్రచారం జరిగింది. మలాయ్ భాషలో అనువాద కార్యక్రమాలు జరిగినప్పుడు రజనీకాంత్ స్టైల్‌కు తగ్గట్టుగా ఆయన పాత్రకు డబ్బింగ్ చెప్పేవారు లేకపోవడం కారణంగా ఆ భాషానువాద కార్యక్రమాలు ఆలస్యం కావడంతో విడుదలను వాయిదా వేశామని చిత్ర యూనిట్ వెల్లడించింది. మొత్తానికి ఈ సినిమా జూలై 29న విడుదల అయ్యే అవకాశాలు మాత్రం మెండుగా కన్పిస్తున్నాయి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here