Home Cinema బాబోయ్…కబాలి సినిమా కోసం సెలవిచ్చేశారు

బాబోయ్…కబాలి సినిమా కోసం సెలవిచ్చేశారు

దేశం అంతటా ప్రస్తుతం ‘కబాలి’ మ్యానియాలో మునిగితేలుతోంది. మరి రజనీకాంత్ నివాసం ఉండే తమిళనాడులో ఇక  ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అక్కడ అయితే  అందరూ రజనీలో మత్తులో ఉన్నారనే చెప్పొచ్చు. కేవలం కబాలి సినిమా చూసేందుకు చెన్నయ్ లోని ఐటి కంపెనీలు మొదలుకుని పలు సంస్థలు జూలై 22న సెలవు ప్రకటించాయంటే చెన్నయ్ లో పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. రజనీ అభిమానులు ఎలాంటి నిరాశ చెందకూడదనే ఐటి కంపెనీలు మొదలుకుని పలు సంస్థలు ఈ ఏర్పాట్లు చేశాయి. బెంగూళూరులో అయితే మామూలు థియేటర్లతో పాటు పలు స్టార్ హోటళ్లలోనూ ప్రత్యేక షోలు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే అందరూ కబాలి ఫీవర్ లో ఉంటే..రజనీ మాత్రం  తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో అమెరికాలోని సచ్చిదానంద ఆశ్రమాన్ని సందర్శించారు.

ఆయన వెంట కూతురు సౌందర్యా ధనుష్ కూడా ఉన్నారు. 1980లో వర్జీనియాలో ఏర్పాటైన సచ్చిదానంద ఆశ్రమాన్ని యోగావిల్లే అని పిలుస్తారు. యోగిరాజ్ శ్రీ స్వామి సచ్చిదానంద ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. 1969లో వూడ్‌స్టాక్ ఫెస్టివల్‌ లో ప్రారంభ ఉపన్యాసం చేసిన సచ్చిదానంద పాశ్చాత్యులకు ఆధ్యాత్మికవేత్తగా సుప్రసిద్ధులు. 65 ఏళ్ల రజనీకాంత్ దాదాపు నెలకిందట అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అక్కడ కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ శుక్రవారం కబాలి సినిమా విడుదల అవుతుండటంతో రజనీ తిరిగి ఇండియా వచ్చారు. అమెరికా పర్యటనలో తన ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందకు చెందిన ‘లోటస్ ఆల్ ఫెయిత్స్ టెంపుల్’ను రజనీ సందర్శించారని ఆయన కూతురు సౌందర్య ట్విట్టర్‌లో తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here