Home Cinema ఎన్టీఆర్ కుశ టీజర్ రెడీ

ఎన్టీఆర్ కుశ టీజర్ రెడీ

jn ntr

శుక్రవారం ఎన్టీఆర్ అభిమానులకు మరో కానుక. కుశ టీజర్ సరిగ్గా ఉదయం పది గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటించింది. ఇఫ్పటికే విడుదలైన  జై..లవ టీజర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. మూడు పాత్రలకు సంబంధించి చివరి టీజర్ ఇదే. పదవ తారీఖున హైదరాబాద్ లో అట్టహాసంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేసేందరకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

                           అందుకు తగ్గట్లుగానే సినిమా డైలాగులు..ఎన్టీఆర్ యాక్షన్ అదిరిపోయేలా ఉన్నట్లు టీజర్లలోనే హింట్ ఇచ్చాడు దర్శకుడు. దీంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. మరి శుక్రవారం విడుదలయ్యే కుశ టీజర్ ఎంత సంచలనం రేపుతుందో చూడాల్సి. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా రాశీఖన్నా..నివేదా థామస్ లు సందడి చేయనున్నారు. సెప్టెంబర్ 21న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here