Home Cinema ఎన్టీఆర్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా’ జైలవకుశ’

ఎన్టీఆర్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా’ జైలవకుశ’

jr ntr

జైలవకుశ సినిమాతో ఎన్టీఆర్ మరో రికార్డు సృష్టించారు. ఆయన కెరీర్ లోనే అతి పెద్ద గ్రాసర్ గా ఈ సినిమా నిలిచింది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు. అంతే కాదు..థ్యాంక్యూ ‘జై’.. ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ ఎన్టీఆర్ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమాగా ‘జనతా గ్యారేజ్’ ఉండేది. ఇప్పుడు ఆ సినిమా రికార్డును అధిగమించి ‘జైలవకుశ’ కొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇఫ్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు చెబుతున్నారు.

                          అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన లేదు. అయితే జైలవకుశ సినిమాను ఎన్టీఆర్ మొత్తం ఒంటిచేత్తో నడిపించిన విషయం తెలిసిందే. సినిమాలో స్టోరీ..మిగిలిన అంశాల కంటే జై పాత్రలో ఎన్టీఆర్ నటన..క్లైమాక్స్ సన్నివేశాలు..అందులో ఎన్టీఆర్ నటన సినిమాను ఓ రేంజ్ కు తీసుకెళ్ళాయి. జైలవకుశ కలెక్షన్లు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ కుషీ కుషీగా ఉన్నారు. ఎన్టీఆర్ కొద్ది రోజుల విరామం అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో నటించనున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here