Home Telugu వారానికి 50 లక్షల ఫోన్లు..జియో టార్గెట్!

వారానికి 50 లక్షల ఫోన్లు..జియో టార్గెట్!

jio phone

అవును. మీరు చదువుతున్నది నిజమే. రిలయన్స్ జియో వారానికి ఏభై లక్షల ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విక్రయించటం అంటే తొలుత వినియోగదారుడు వీటి కోసం 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత ఈ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తామని జియో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ కోసం ఇఫ్పుడు జియో వినియోగదారులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జియో సర్వీసుల తరహాలోనే ఇది ఎంత సంచలనం సృష్టిస్తుందో అని మార్కెట్ వర్గాలు కూడా ఆసక్తిగా దీని కోసం ఎదురుచూస్తున్నాయి. త్వరలోనే సంచలన రిలయన్స్‌ జియో ఉచిత ఫోన్‌ కోసం ప్రీ బుకింగ్స్‌ ప్రారంభం కానున్నాయి.  ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్స్‌ (ఆన్‌లైన్‌ అండ్‌  ఆఫ్‌లైన్‌)  కానున్నాయి.

                       ముందు వచ్చిన వారికి ముందు పద్దతిలో సెప్టెంబరులో  ఈ జియో ఫోన్‌ వినియోగదారుల చేతికి  అందనుంది. మరో మూడు రోజుల్లో  జియోఫోన్ టెస్టింగ్‌  ప్రారంభం కానుంది. ‘ఇండియా కా స్మార్ట్‌ ఫోన్’ గా    అని జియో చెప్పుకుంటున్న ఈ 4 జీ వీవోఎల్‌టీఈ ఎంట్రీ-లెవల్ హ్యాండ్‌సెట్‌ ఆగస్టు 15 నుంచి బీటా టెస్టింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ కోసం ప్రత్యేకమైన డేటా ప్రణాళికలను కూడా కంపెనీ వెల్లడించింది కూడా. జూలై 21 న రిలయన్స్  ఎజీఎంలో రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ  జియో 4జీ ఫీచర్‌ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఆగస్టు 15 నాటికి ఈ పరికరం పరీక్ష కోసం అందుబాటులో ఉంటుందని కంపెనీ వాగ్దానం చేసింది. అలాగే జియో కస్టమర్లకు ఇది పూర్తిగా ఉచితమని ప్రకటించారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here