Home Telugu ఆ అబ్బాయికి జీవితాంతం ఉచిత ఫ్లైట్ టిక్కెట్లు

ఆ అబ్బాయికి జీవితాంతం ఉచిత ఫ్లైట్ టిక్కెట్లు

jet airways

అవును.మీరు చదువుతున్నది నిజమే. ఆ అబ్బాయి జీవితాంతం ఉచితంగా గాల్లో ఎగరనున్నారు. ఎందుకలా?.అలా ఎవరు ఇస్తున్నారు అంటారా?. ఆ అబ్బాయి విమానంలో పుట్టడమే అందుకు కారణం. భారత్ కు చెందిన ప్రముఖ ఎయిర్ లైన్స్ జెట్ ఎయిర్ వేస్ తమ విమానంలో పుట్టిన ఈ అబ్బాయికు ఈ ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి కారణం జెట్ ఎయిర్ వేస్ విమానాల్లో ఇలాంటి సంఘటన జరగటం ఇదే తొలిసారి.                              దీంతో జెట్ ఎయిర్ వేస్  ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

                            జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన 9డబ్ల్యూ569 విమానం ఆదివారం తెల్లవారుజామున సౌదీ అరేబియాలోని డమ్మమ్‌ నుంచి కొచ్చికి బయులుదేరింది. ప్రయాణం మధ్యలో ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలై విమానంలోనే మగబిడ్డను ప్రసవించింది. విమానంలో పుట్టిన ఆ శిశువుకు జీవితమంతా టికెట్లు ఉచితంగా ఇవ్వాలని జెట్‌ ఎయిర్‌వేస్‌ నిర్ణయించింది. ఆ బుడ్డోడు అలా ఒకేసారి రెండు రికార్డులను సొంతం చేసుకున్నాడన్న మాట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here