Home Andhra Pradesh విదేశాలకు జె సీ దివాకర్ రెడ్డి జంప్

విదేశాలకు జె సీ దివాకర్ రెడ్డి జంప్

jc-diwakar-reddy

విశాఖపట్నం విమానాశ్రయంలో హంగామా సృష్టించిన తెలుగుదేశం పార్టీ ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి విదేశాలకు చెక్కేశారు. ఓ వైపు దేశంలోని అన్ని ఎయిర్ లైన్స్ ఆయన ప్రయాణంపై నిషేధం విధించగా…ఆయన ఎంచక్కా విదేశీ ఎయిర్ లైన్స్ లో టూర్ కు వెళ్ళారు. విశాఖపట్నం విమానాశ్రయంలో ఓ వ్యక్తిని బలంగా తోయటంతో పాటు..ఇండిగో కౌంటర్ లో ఉన్న ప్రింటర్ ను ఎత్తేసి…కింద పెట్టడం…తీవ్ర ఆగ్రహంగా వ్యాఖ్యలు చేసిన వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది.

                                      టీడీపీ నేతలు ఆయనతో క్షమాపణ చెప్పించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించనట్లు లేవు. ముందే ప్లాన్ చేసుకున్న ట్రిప్ ప్రకారం ఆయన శుక్రవారం రాత్రి 9:50 గంటలకు ఎమిరెట్స్ విమానంలో దుబాయ్ వెళ్లి, అక్కడి నుంచి మరో విమానంలో ఫ్రాన్స్ చేరుకున్నారు. దాదాపు వారం రోజులు కుటుంబంతో అక్కడే గడుపుతారని సమాచారం.  

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here