Home Andhra Pradesh ఎంపీ అని ఎగిరిపడితే..ఎగరటం కష్టమే

ఎంపీ అని ఎగిరిపడితే..ఎగరటం కష్టమే

jc-diwakar-reddy

చట్టాలు చేసే సభ్యులే ఆ చట్టాలను ఉల్లంఘిస్తే. ఈ మధ్యే అదే జరుగుతోంది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఘటన మర్చిపోక ముందే తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి అదే సీన్ క్రియేట్ చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో హంగామా సృష్టించారు. ఇండిగో కౌంటర్ లోని ప్రింటర్ కోపంతో ఎత్తిపడేయబోయి..కాస్త తమాయించుకుని మళ్ళీ అక్కడే పెట్టేశారు. కానీ సిబ్బందిపై మాత్రం తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసి..తాను ఎంపీనని..తనకు బోర్డింగ్ పాస్ ఇవ్వాల్సిందే అంటూ వాగ్వాదానికి దిగారు. ఇది జరిగిన కొద్ది గంటలకే ఇండిగో తోపాటు ప్రభుత్వ రంగ ఎయిర్ లైన్స్ అయిన ఎయిర్ ఇండియా టీడీపీ ఎంపీ  జె సీ దివాకర్ రెడ్డిని తమ విమానాల్లో ప్రయాణించబోమని ప్రకటించాయి. ఆయన విమాన ప్రయాణాలపై నిషేధం విధించాయి. ఇవి ప్రకటించిన కొద్దిసేపటికే స్పైస్ జెట్…ఇతర ఎయిర్ లైన్స్ లు కూడా అదే బాట పట్టాయి.

                            అంటే జె సీ దివాకర్ రెడ్డి రెడ్డి ఇప్పటికిప్పుడు ఎక్కడికి అయినా విమాన ప్రయాణం చేయాలంటే కష్టమే. ఇదే జె సీ గతంలోనూ గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బందితోనూ ఈ తరహాలోనే   గొడవకు దిగారు. అయితే గైక్వాడ్ తరహాలోనే ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి కూడా బహిరంగ క్షమాపణ చెపితే ఎయిర్ లైన్స్ తమ నిర్ణయాన్ని సమీక్షించుకునే అవకాశం ఉంది. గైక్వాడ్ ఘటన అనంతరం ప్రజా ప్రతినిధుల అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కొన్ని మార్గదర్శకాలు పెట్టుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here