Home Andhra Pradesh జె సీ కి ‘చుక్కలు చూపిస్తున్న ఎయిర్ లైన్స్’

జె సీ కి ‘చుక్కలు చూపిస్తున్న ఎయిర్ లైన్స్’

jc diwakar reddy

తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి ఎయిర్ లైన్స్ చుక్కలు చూపిస్తున్నాయి. ఆయనపై నిషేధం కొనసాగుతూనే ఉంది. జెసీ ఆదివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చి  ట్రూ జెట్‌ విమానంలో ప్రయాణించేందుకు టికెట్‌ కోసం యత్నించారు. అయితే  ట్రూ జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అధికారులు మాత్రం ఎంపీ జేసీకి టికెట్‌ ఇచ్చేందుకు నిరాకరించడంతో వెనక్కి వెళ్ళిపోయారు.  విశాఖపట్నం విమానాశ్రయంలో ఆలశ్యంగా వచ్చిన జెసీ ఇండిగో ఎయిర్ లైన్స్‌  సిబ్బందిపై దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే.

                           తర్వాత ఆయనపై ఇండిగో తోపాటు పలు ఎయర్ లైన్స్ ఆయనపై నిషేధం విధించాయి. అందులో ఎయిర్‌ ఇండియా, స్పైస్‌  జెట్‌,   జెట్‌ ఎయిర్‌ వేస్‌ కూడా నిషేధాన్ని అమలు చేశాయి. దీంతో దేశీయంగా జె సీ విమానప్రయాణం చేయటం కష్టంగా మారింది. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పి..భవిష్యత్ లో ఇలాంటి పునరావృతం కానివ్వమని హామీ ఇస్తే తప్ప..జెసీపై నిషేధం ఎత్తివేసే అవకాశం లేదని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here