Home Cinema ‘జయ జానకి నాయక’ అంటున్న బెల్లంకొండ

‘జయ జానకి నాయక’ అంటున్న బెల్లంకొండ

jaya janaki nayaka

బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా పుల్ స్వింగ్ లో నడుస్తోంది. పలు  మాస్ సినిమాలతో  సూపర్ హిట్ లు కొట్టిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తున్నారు.  సినిమాకు ‘ జయ జానకీ నాయక’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.  మిరయాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది.

                            అల్లుడు శీను సినిమాతో వెండితెరకు పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న ఈ యంగ్ హీరో రెండో సినిమా తీవ్రంగా నిరాశపరచటంతో మూడో సినిమాను మరోసారి భారీగా.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయినా బెల్లంకొండ శ్రీనివాస్ కోరికను నెరవేరుస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here