Home Telangana ‘కాగ్’ ఉత్సాహంలో కాంగ్రెస్

‘కాగ్’ ఉత్సాహంలో కాంగ్రెస్

janareddy

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ‘కాగ్’ కాస్త ఉత్సాహన్ని ఇచ్చింది. చూశారా?. మేం చెప్పిన విషయాలే కాగ్ చెప్పింది అంటూ కాంగ్రెస్ నేతలు తెలంగాణ సర్కారుపై విమర్శలకు దిగారు. సర్కారు భవిష్యత్ లోనూ ఇలాగే వ్యవహరిస్తే విజయ్ మాల్యా పరిస్థితే ప్రభుత్వానికి వస్తుందని ప్రతిపక్ష నేత జానారెడ్డి విచిత్ర హెచ్చరిక చేశారు. మిగిలిన నేతలు కూడా కాగ్ ఆధారంగా కెసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా వుందని అసెంబ్లీలో తాను చెప్పిన విషయాలు కాగ్ నివేదికతో బహిర్గతం అయ్యాయని తెలిపారు. ఆర్థిక నిర్వహణలో సర్కారు అస్తవ్యస్థ విధానాలను కాగ్ తప్పుపట్టింది. ముఖ్యంగా రెవెన్యూ మిగులు ఎక్కువగా చూపించి..ద్రవ్యలోటును తక్కువగా చూపినల్లు కాగ్ తప్పుపట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి అవాస్తవిక బడ్జెట్ అంటూ కాగ్ స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో ఉత్సాహన్ని నింపాయి. ఈ అంశాలపై ప్రతిపక్ష నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడారు.

                     ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్లో సగం కూడా ఖర్చుచేయలేదని కాగ్ తేల్చిందని జానారెడ్డి విమర్శించారు.  టీఆర్‌ఎస్‌ హామీలకు తగిన విధంగా ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని,  కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడంలేదన్నారు. ‘కొత్త రాష్ట్రం అనే సంయమనం పాటిస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. మా సహకారాన్ని ప్రభుత్వం సరిగా అర్ధం చేసుకోలేకపోతే ప్రజా ఆందోళనలు వస్తాయి. ఆస్తులు.. ఆదాయాల కంటే.. అప్పులు ఎక్కువయితే ప్రమాదం. ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తున్న అప్పులు ఆందోళన కరంగా ఉన్నాయి. ప్రభుత్వ ఆర్ధిక విధానాలు రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిలను ఆర్ధిక వేత్తలు ప్రజలకు తెలియజేయాలి. అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే ప్రభుత్వానికే కాదు.. ఇతరపార్టీలకు కూడా కాంగ్రెస్ సహకరించింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు పసలేనివి.. ఉద్వేగం, ఉద్రేకం తో మాట్లాడినవి ’ అని ఆయన తెలిపారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here