Home Andhra Pradesh నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర

నవంబర్ 2 నుంచి జగన్ పాదయాత్ర

jagan

ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. తొలుత ఈ నెల 27 నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ తేదీని వచ్చే నెల2కు మార్చారు. ఈ పాదయాత్ర ఏకబిగిన ఆరు నెలల పాటు సాగనుంది. ఆరు నెలల పాటు తనకు వారం వారం కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ ఇప్పటికే సీబీఐ కోర్టులో పిటీషన్ వేశారు.

                     జగన్ పాదయాత్రకు కోర్టు అనుమతి తప్పనిసరి కానుంది. సోమవారం నాడు అనంతపురం లో నిర్వహించిన యువభేరి సమావేశంలో జగన్ తన పాదయాత్ర గురించి ప్రకటించారు. నవంబర్‌ 2 నుంచి ఇడుపులపాయ నుంచి చిత్తూరు మీదుగా ఇచ్ఛాపురం దాకా సాగుతుందని తెలిపారు.  ఆరు నెలల్లో మూడువేల కిలోమీటర్లు జరిగే పాదయాత్ర సాగనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here