Home Andhra Pradesh ఈసీ నోటీసులకు జగన్ వివరణ

ఈసీ నోటీసులకు జగన్ వివరణ

jagan

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వివరణ ఇచ్చారు. ఈసీ జారీ చేసిన నోటీసులకు సమాధానంగా ఆయన ఈ వివరణ ఇచ్చారు. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని..అందులో ఏవీ అమలు చేయలేదని..ఆ ఆవేదనతోనే మాట్లాడాను తప్ప..తనకు ఎలాంటి దురుద్దేశంలేదని పేర్కొన్నారు. నంద్యాల ఎన్నికల ప్రచారసభలో సీఎం చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేందంటూ జగన్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయటంతోపాటు..రాష్ట్రవ్యాప్తంగా నిరసనలుచేపట్టి..జగన్ దిష్టిబొమ్మలను దహనం చేసే కార్యక్రమం చేపట్టింది.

                  అదే సమయంలో ఈసీకి కూడా టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈసీ ఈ వ్యాఖ్యలపై  48 గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ జగన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈసీ ఆదేశం మేరకు మంగళవారం జగన్ వివరణ ఇచ్చారు. హామీల అమలులో చంద్రబాబు వైఫల్యం చెందారని, ఈ కారణంగానే మనస్తాపం చెంది.. చంద్రబాబుపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, స్వాతంత్ర్య వేడుకల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదని పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here