Home Andhra Pradesh చంద్రబాబు..జగన్ ఇద్దరూ ‘మోడీ’కి సరెండర్

చంద్రబాబు..జగన్ ఇద్దరూ ‘మోడీ’కి సరెండర్

jagan, babu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు..ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ ‘మోడీకి సరెండర్’ అయ్యారా?. అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతుకోరుతూ…చంద్రబాబుకు ప్రధాని మోడీ…జగన్ కు అమిత్ షాలు ఫోన్లు చేశారు. ఇద్దరూ ఎంచక్కా ఎస్..మా మద్దతు మీకే అని ప్రకటించేశారు.  ఇందులో ఎవరికీ వివాదం లేదు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి వీళ్ళను మద్దతు ఇవ్వొద్దని ఎవరూ చెప్పరు.. ఎన్నికలకు ముందు విభజనతో భారీగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ‘ప్రత్యేక హోదా’ చాలా కీలకమైంది. కానీ ఇద్దరూ ఓ మంచి ఛాన్స్ ను మిస్ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నిక మద్దతుకు…ప్రత్యేక హోదాకు ఇద్దరూ కలసి  లింక్ పెడితే ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చేది. కానీ ఇద్దరూ అది చేయలేదు. అంటే అటు చంద్రబాబు..ఇటు జగన్ లు మోడీకి సరెండర్ అయినట్లే లెక్క. చంద్రబాబు తీరు చూస్తే మాత్రం మరీ విచిత్రం. ఈ మధ్య జగన్ ఢిల్లీలో మోడీతో భేటీ అనంతరం రాష్ట్రపతి ఎన్నికలో మద్దతు ఇస్తామని ప్రకటిస్తే చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలు నానా రచ్చ  చేశారు. రాష్ట్రపతి ఎన్నిక మద్దతుకు…ప్రత్యేక హోదాకు ఎందుకు లింక్ పెట్టలేదని ప్రశ్నించారు.

                         జగన్ కంటే అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలా ఎక్కువ. మరి ఇప్పుడు మోడీ ఫోన్ చేసినప్పుడు చంద్రబాబు ప్రత్యేక హోదా ఇవ్వాలనే లింక్ ఎందుకు పెట్టలేకపోయారు?. అసలు ఓ సారి ప్రత్యేక హోదా వేస్ట్..ప్యాకేజీనే బెస్ట్ అని వాదిస్తారు. జగన్ దగ్గరకు వచ్చే సరికి ప్రత్యేక హోదాకు ఎందుకు లింక్ పెట్టలేదని నిలదీస్తారు. అంటే ఏతా వాతా తేలింది ఏమిటంటే అటు చంద్రబాబుకు అయినా..ఇటు జగన్ అయినా కావాల్సింది వారి అవసరాలు..రాజకీయాలే తప్ప…ఏపీ ప్రయోజనాలు కాదనే విషయం అర్థం అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్డీయే ఖరారు చేసిన దళిత అభ్యర్థికి మద్దతు ఇవ్వొద్దని ఎవరూ చెప్పరని..కానీ ప్రత్యేక హోదాతో పాటు ఏపీకి పలు అంశాల్లో అన్యాయం జరుగుతోందని ..చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని చెబుతూనే…మీరు అడగాలే కానీ..మేం ఏమైనా ఇస్తామన్న చందంగా ఇద్దరూ మద్దతు పలికేశారన్న మాట.శభాష్.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here