Home Andhra Pradesh మాట తప్పిన లీడర్లను కాలర్ పట్టుకోండి

మాట తప్పిన లీడర్లను కాలర్ పట్టుకోండి

Jagan

నంద్యాల ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు హీట్ ఎక్కుతోంది. ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి మాత్రం నంద్యాలలో ప్రచార జోరు కొనసాగిస్తున్నారు. అదే సమయంలో పరుష పదజాలంతో విమర్శలు గుప్పిస్తున్నారు. మాట తప్పిన లీడర్లను కాలర్ పట్టుకుని నిలదీయాలని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్నూలు ప్రజలను మోసం చేశారని జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఒంటివెలగలలో జరిగిన రోడ్‌ షోలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. మూడున్నరేళ్లలో ముఖ్యమంత్రి, టీడీపీకి చెందిన ప్రధాన నాయకులెవరూ నంద్యాల వైపు తిరిగి చూడలేదని అన్నారు.   అదే ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే ఓట్ల కోసం నంద్యాల వీధుల్లో ఎక్కడ చూసిన టీడీపీ చూసినా శ్రేణులు కనిపిస్తున్నాయని చెప్పారు. ఇప్పుడు నంద్యాలలో గత మూడున్నరేళ్లుగా ఎన్నడూ జరగనంతగా హడావుడి జరుగుతుందన్నారు.

                             ఎన్నికల వస్తాయని తెలియక ముందు వరకూ చంద్రబాబు ఏ రోజైనా నంద్యాల వచ్చారా?. కనీసం ఆయన కేబినేట్‌లోని మంత్రులైనా పట్టణం వైపు తిరిగిచూశారా?. నేడు ఉప ఎన్నిక వచ్చేసరికి టీడీపీ నాయకులందరూ నంద్యాల రోడ్ల మీద కనపడుతున్నారు. చంద్రబాబు బెంబేలెత్తిపోయి హడావుడిగా జీవోల మీద జీవోలు జారీ చేస్తూ పోతున్నారు. చంద్రబాబు తన అవినీతి సంపాదన వందల కోట్ల రూపాయలతో ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయడానికి వస్తున్నారు జాగ్రత్త అంటూ ప్రజలను హెచ్చరించారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here