Home Andhra Pradesh చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి

చంద్రబాబు సిగ్గుతో తలవంచుకోవాలి

Jagan

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ‘వేరే పార్టీ గుర్తుపై గెలిచిన వారిని ‘మీ రేటు ఎంత? అని నేరుగా అడుగుతున్నారు. ఎవరైనా డబ్బుకు  లొంగకపోతే బెదిరిస్తున్నారు. కిడ్నాప్ లు చేస్తున్నారు. ఇదేమి ప్రజాస్వామ్యం. ఇలాంటి ఘటనలు చేయిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిగ్గుతో తలదించుకోవాలి.’ అని జగన్ వ్యాఖ్యానించారు. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మాత్రం మెజారిటీ లేకున్నా బరిలోకి దిగి టీడీపీ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తోందని విమర్శించారు. జగన్ శుక్రవారం నాడు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జమ్ములమడుగు పోలింగ్‌ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.     తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు జరుగుతున్న మూడు జిల్లాల్లోనూ (వైఎస్‌ఆర్‌ జిల్లా, నెల్లూరు, కర్నూలు) వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మెజార్టీ ఉందన్నారు.

                            తమకు మెజార్టీ ఉన్న స్థానాల్లో టీడీపీ నేతలు పోటీ చేయడం సిగ్గుచేటు అని వైఎస్‌ జగన్‌ వ్యాఖ్యానించారు. పార్టీ గుర్తుల మీద గెలిచిన తర్వాత కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి… అవహేళన చేయడం దారుణమన్నారు. జిల్లాలో 841మంది ఓటర్లు ఉంటే వారిలో 521మంది ఓటర్లు వైఎస్‌ఆర్‌ సీపీ గుర్తుపై గెలిచారన్నారు. ప్రలోభపెట్టి, భయపెట్టి ఓటు వేయించుకోవాలని చూడటం సరికాదన్నారు. పైన దేవుడు ఉన్నాడని, ప్రజల్లో ఇంకా అభిమానం, మంచితనం మిగిలే ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ని కుయుక్తులు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here