Home Telangana హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్

హైదరాబాద్ కు ఇవాంకా ట్రంప్

ivanka trump

హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతోంది. ఈ సదస్సుకు వస్తున్న అతిధులు ఎంతో ప్రత్యేకం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ దీనికి హాజరువుతున్నారు. అమె అమెరికా నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తల బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. భారత్..అమెరికాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఏడాది నవంబర్ 28-30 తేదీల్లో హైదరాబాద్ గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ (జీఈఎస్)కు ఆతిధ్యం ఇవ్వనుంది. స్టార్టప్స్ కు సంబంధించి అంతర్జాతీయ ప్రముఖులను, పారిశ్రామికవేత్తలను ఒకేదగ్గరకు చేర్చేందుకు ఇది కీలక సమావేశం కానుందని ప్రధాని మోడీ తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరుకానున్నారు. భారత్, అమెరికాలు సంయుక్తంగా ఈ సదస్సుకు సహ అతిధ్య దేశాలుగా ఉన్నాయి. మోడీ ట్వీట్  పై తెలంగాణ సీఎం కెసీఆర్, మంత్రి కెటీఆర్ లు స్పందించారు. నరేంద్ర మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూతురు ఇవాంకా ట్రంప్‌ హాజరయ్యేందుకు అంగీకరించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సదస్సుకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముఖ్యమంత్రి అన్నారు.

                               ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడం ఔత్సాహికులకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. చారిత్రక నగరమైన హైదరాబాద్‌ ఈ చారిత్రక సదస్సుకు వేదిక అవుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఈ సదస్సుకు వచ్చే అమెరికా బృందానికి ఇవాంకా నాయకత్వం వహిస్తుండగా, భారతదేశం తరఫున ప్రధాని నరేంద్ర మోదీ అమితాసక్తి చూపడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఇవాంకాతోపాటు ఆమె నేతృత్వం వహిస్తున్న బృందాన్ని స్వాగతించేందుకు తాము ఆసక్తిగా ఎధురుచూస్తున్నట్లు మంత్రి కెటీఆర్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here