Home Latest News సర్కారుకు పెరిగిన ఐటి ఆదాయం

సర్కారుకు పెరిగిన ఐటి ఆదాయం

IT dept

ఐటి రిటర్న్స్ దాఖలులో చెప్పుకోదగ్గ వృద్ధి ఉంది. మరి పన్నులు చెల్లింపులు పెరిగాయా?. ఖచ్చితంగా పెరిగాయని ఐటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన గణాంకాలు అందుబాటులోకి కావటానికి కొంత సమయం పడుతుందని చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. 2016–17 సంవత్సరానికి గాను 2.82 కోట్ల రిటర్నులు వచ్చినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో దాఖలైన 2.22 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే 25.3 శాతం అధికమని వివరించింది.

                     ఆగస్టు 5 దాకా మొత్తం 2.82 కోట్ల రిటర్నులు దాఖలైనట్లు ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వాస్తవానికి ఐటీఆర్‌ల దాఖలుకు జూలై 31 ఆఖరు తేదీ అయినప్పటికీ.. కొన్ని వర్గాల కోసం ఆగస్టు 5 దాకా ప్రభుత్వం పొడిగించిన సంగతి విదితమే. కొత్తగా మరింత మందిని పన్ను పరిధిలోకి తేగలిగినట్లు తాజా గణాం కాలు సూచిస్తున్నాయని ఆదాయ పన్ను విభాగం పేర్కొంది. వ్యక్తిగత ఆదాయ పన్ను కు సంబంధించి (కార్పొరేట్‌ ట్యాక్స్‌ కాకుం డా) అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు ఆగస్టు 5 నా టికి 41.79 శాతం వృద్ధి నమోదు చేశాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here